Bihar Road Accident: బీహార్‌లోని కటిహార్ జిల్లాలో శనివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి-31పై గెరాబారి గ్రామం వద్ద ఒక ప్రైవేట్ బస్సు, వ్యాన్ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో 13 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, చికిత్స పొందుతూ మరో ఐదుగురు కన్నుమూశారు.
Read Also: Hyderabad: వాటర్ కనెక్షన్ కట్ చేస్తామంటూ మెసేజ్ వస్తే క్లిక్ చేయకండి: సీపీ సజ్జనార్
Bihar Road Accident: ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి.. భారీ ఎక్స్‌గ్రేషియా
ఈ ప్రమాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులంతా జార్ఖండ్ నుండి పూర్ణియాకు తిరిగి వస్తున్న గిరిజన తెగకు చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Katihar Bus Crash
బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ప్రయాణంలో అక్కడక్కడా వాహనాన్ని తప్పుగా నడిపాడని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. బస్సు దత్పూర్ ముసాహరి చౌక్ వద్దకు రాగానే అదుపుతప్పి వ్యాన్‌ను ఢీకొట్టిందని కోధా ఎస్‌హెచ్‌ఓ సుజీత్ కుమార్ తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
బిగ్‌బాస్ ఫేమ్ విష్ణుప్రియపై పోలీస్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?

