Vemula Veeresham: బిజెపి, బిఆర్ఎస్ పార్టీల మధ్య అండర్ స్టాండింగ్ తోనే బండి భగీరథ్ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఐపిఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శించారు.
సిఎల్పిలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ బండి భగీరథ్ కేసు తామే వెలికి తీశామన్నట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాడనీ ఫోక్సో కేసులో ఎక్కడైనా స్టేషన్ బెయిల్ ఇస్తారా..? అని విమర్శించారు. కెసిఆర్ కెటిఆర్ భరతం పడతా, దొర గడీలు బద్దలు కొట్టి ఏనుగును తీసుకు పోతానని గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పారనీ ఇప్పుడు. దొర గడీల్లో ఏనుగును తాకట్టుపెట్టి బానిసలా మారాడని ఎద్దేవా చేశారు. దొర గడీలు బద్దలు కొట్టింది మా రేవంతైతే ఏనుగును దొరగడిలో తాకుట్ట పెట్టింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
Read also: Good News : తెలంగాణ లోని నిరుద్యోగ మహిళలకు శుభవార్త
RS Praveen Kumar criticizes Revanth
Vemula Veeresham: బండి భగీరథ్ పై ఎస్ఐఆర్ నమోదు తరువాత బిఆర్ఎస్ గొంతు ఎత్తింది
దొర గడీకి పోయిన ప్రభాకర్ రావు చాలా మంచోడని ఎంతో దిగజారిపోయి స్టేట్ మెంట్ ఇచ్చాడనీ అన్నారు. ఫాంహౌస్ గురించి సెక్యూరిటీ ఇచ్చే పోలీస్, కెసిఆర్ దుర్మార్గాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాపాడటానికి మారాడనీ తెలిపారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ రోల్ మోడల్ అనీ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ పోలీసులు మార్చారనీ చెప్పారు.. తెలంగాణ పోలీసుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా పోలీస్ అయ్యాడనీ ప్రశ్నించారు. భగీరథ్ ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువచ్చిన వీడియోలు ఉన్నాయనీ పోలీసులు చెప్పేది నమ్మకుండా రాజకీయ నాయకులు చెప్పే విషయాలను నమ్మే దీన స్థితిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడనీ విమర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్ బిజెపి పైన మాట్లాడకుండా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నాడనీ ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనీ హితవు చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇంటిని మా పోలీసులు సోదా చేశారనీ చెప్పారు. బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారనీ తెలిపారు. పారదర్శకంగా మా సిఎం పనిచేస్తుంటే విమర్శలు చేస్తున్నారనీ తెలిపారు. ఎఫ్ ఐ ఆర్ అయిన తర్వాత కూడా సెక్షన్లు మార్చి కేసును మరింత బలోపేతం చేశారనీ వివరించారు. ఉడత ఊపులకు తాటి చెట్టు కదలదనీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు పెట్టుకో తెలంగాణ సమాజానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాడనీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

