Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ లో ఎంతమంది ఐటీ ఉద్యోగులు ఉన్నారో తెలుసా ?

హైదరాబాద్ లో ఎంతమంది ఐటీ ఉద్యోగులు ఉన్నారో తెలుసా ?

వార్త 3 days ago

IT Employee : భారతదేశ సాంకేతిక రాజధానుల్లో ఒకటైన హైదరాబాద్ మహానగరం ఐటీ రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. నగరంలో శరవేగంగా విస్తరిస్తున్న సాంకేతిక మౌలిక వసతులు, ప్రపంచస్థాయి కంపెనీల పెట్టుబడుల కారణంగా ఐటీ ఉద్యోగుల సంఖ్య మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది.

ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, గత ఏడాది (2025) డిసెంబర్ నాటికి నగరంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య దాదాపు 10.2 లక్షలుగా ఉండేది. అయితే, ఈ ఏడాది (2026) చివరి నాటికి ఈ సంఖ్య ఏకంగా 11 లక్షల మార్కును దాటబోతోందని తెలంగాణ ఐటీ శాఖ అత్యంత ఆశాజనకమైన అంచనాలను వెలువరించింది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు పెద్ద ఎత్తున గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) హైదరాబాద్‌ను తమ ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడమే ఈ భారీ ఉపాధి వృద్ధికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు

రికార్డు స్థాయికి ఐటీ ఎగుమతులు

సాంకేతిక నిపుణుల సంఖ్య పెరగడమే కాకుండా, హైదరాబాద్ నుంచి జరిగే సాఫ్ట్‌వేర్ ఎగుమతులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతాన్ని ఇస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.3.13 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరగ్గా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య ఏకంగా రూ.3.6 లక్షల కోట్లకు పైగా పెరగవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేవలం హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి సంప్రదాయ ఐటీ కారిడార్లకే పరిమితం కాకుండా, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ద్వితీయ శ్రేణి ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. ప్రభుత్వం కల్పిస్తున్న అనుకూల విధానాలు, నిరంతర విద్యుత్ సరఫరా మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎకో-సిస్టమ్ కారణంగా రాబోయే రోజుల్లో బెంగళూరును అధిగమించి హైదరాబాద్ దేశంలోనే అగ్రగామి ఐటీ హబ్‌గా అవతరించడానికి బలమైన పునాదులు పడుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha