Dailyhunt
బీజేపీ చారిత్రక విజయం.. బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?

బీజేపీ చారిత్రక విజయం.. బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?

వార్త 3 days ago

West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 206 స్థానాలతో ప్రభంజనం సృష్టించి, తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకోనుంది. ఈ చారిత్రక విజయంతో ఇప్పుడు అందరి దృష్టి 'తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?' అనే అంశంపైనే ఉంది.

Read Also: Tamilnadu : సెన్సేషనల్ రికార్డును సొంతం చేసుకున్న TVK పార్టీ

 West Bengal: BJP’s historic victory.. Who is the next Chief Minister of Bengal?

ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కీలక నేతలు

బెంగాల్ పీఠంపై కూర్చోబోయే నేత ఎవరనే విషయంలో బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రేసులో ఉన్న ప్రధాన పేర్లు ఇవే: మమతా బెనర్జీపై నందిగ్రామ్, భవానీపూర్ రెండింటిలోనూ గెలిచి ‘జెయింట్ కిల్లర్’గా నిలిచిన సువేందు అధికారి పేరు ముఖ్యమంత్రి పదవికి మొదటి వరుసలో ఉంది. క్షేత్రస్థాయిలో ఆయనకున్న పట్టు పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్. మహిళా ఓటర్లను ఆకట్టుకోవాలని, మమతా బెనర్జీకి ప్రత్యామ్నాయంగా ఒక శక్తివంతమైన మహిళా నేతను నిలబెట్టాలని బీజేపీ భావిస్తే, అగ్నిమిత్ర పాల్‌కు అవకాశం దక్కవచ్చు. ఆమె అసన్ సోల్ సౌత్ నుంచి ఘనవిజయం సాధించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడైన సమిక్ భట్టాచార్య పేరు కూడా పరిశీలనలో ఉంది. సీనియర్ నేతగా, వ్యూహకర్తగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

అగ్నిమిత్ర పాల్‌కు దక్కనున్న అరుదైన అవకాశం?

బెంగాల్ రాజకీయాల్లో మహిళా సెంటిమెంట్ బలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఒక మహిళను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా టీఎంసీ ఓటు బ్యాంక్‌ను పూర్తిగా తమవైపు తిప్పుకోవచ్చని బీజేపీ యోచిస్తోంది. అదే జరిగితే అగ్నిమిత్ర పాల్ బెంగాల్ బీజేపీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha