పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ, భారత రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ ఘనవిజయం సాధించి తొలిసారిగా బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకున్న తరుణంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాంలో కూడా బీజేపీ 'ఓట్లను దొంగిలించిందని' ఆయన ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అండదండలతోనే ఈ అక్రమాలు జరిగాయని, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను బీజేపీ తుంగలో తొక్కిందని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.
Read Also : TVK విజయ్ కి మెగాస్టార్ విషెష్

మమతా బెనర్జీ వ్యాఖ్యలకు మద్దతు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలతో రాహుల్ గాంధీ పూర్తిస్థాయిలో ఏకీభవించారు. బెంగాల్‌లో బీజేపీ ఏకంగా 100కు పైగా స్థానాలను అక్రమ మార్గాల్లో 'చోరీ' చేసిందని మమత చేసిన వ్యాఖ్యలకు రాహుల్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన 'X' (ట్విట్టర్)లో స్పందిస్తూ.. “పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఒక స్పష్టమైన చోరీ. మమతా జీ చెప్పినట్లుగా 100కు పైగా సీట్లను వారు దొంగిలించారు” అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ఇది కేవలం 'బీజేపీ కమిషన్'లా మారిందని ఆయన దుయ్యబట్టారు.
పాత ఎత్తుగడలే పునరావృతం
బీజేపీ ఇలాంటి ఎత్తుగడలు వేయడం ఇదే మొదటిసారి కాదని రాహుల్ గాంధీ తన కథనంలో వివరించారు. గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇలాంటి అనైతిక పద్ధతులతోనే అధికారాన్ని దక్కించుకుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎన్నికల సంఘాన్ని వాడుకుని ప్రజా తీర్పును తారుమారు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ ఫలితాలు నైతిక విజయం కాదని, అది పూర్తిగా అక్రమ మార్గాల్లో పొందిన విజయమని రాహుల్ ఘాటుగా స్పందించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

