Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ పార్టీకి ఆ పార్టీలు మద్దతు ఇస్తాయా ?

విజయ్ పార్టీకి ఆ పార్టీలు మద్దతు ఇస్తాయా ?

వార్త 1 month ago

మిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సృష్టించిన ప్రకంపనలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ అయిన 118 స్థానాలను సునాయాసంగా చేరుకోలేకపోయింది.

అయితే, ఊహించని విధంగా 108 సీట్లతో విజయ్ నేతృత్వంలోని TVK అతిపెద్ద పార్టీగా అవతరించడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక సంచలనం. అధికారం చేపట్టడానికి మరో 10 సీట్ల స్వల్ప తేడాతో నిలిచిన విజయ్‌కు, ఇప్పుడు చిన్న పార్టీల మద్దతు అత్యంత కీలకంగా మారింది. ప్రజా తీర్పు ప్రధానంగా మార్పు వైపు ఉన్నప్పటికీ, సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే ఇతర పార్టీల వైఖరిపైనే టీవీకే భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Read Also : దళపతి విజయ్ ఆస్తుల తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

మద్దతు కోసం ముమ్మర యత్నాలు

ప్రస్తుత లెక్కల ప్రకారం.. తలా 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ (INC) మరియు పీఎంకే (PMK)లతో పాటు, ఒక్కో సీటు సాధించిన లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు అత్యంత కీలకం కానున్నాయి. ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్‌ను మద్దతు కోరడం ద్వారా చర్చలకు తెరలేపారు. ఒకవేళ కాంగ్రెస్ తన 5 స్థానాలతో విజయ్‌కు అండగా నిలిస్తే, మ్యాజిక్ ఫిగర్ వైపు అడుగులు వేయడం సులభమవుతుంది. అయితే, ఈ సమీకరణం విజయవంతం కావాలంటే భావజాలం పక్కన పెట్టి, కేవలం అధికార స్థాపనే లక్ష్యంగా ఈ పార్టీలు ముందుకు రావాల్సి ఉంటుంది.

మిత్రధర్మం వర్సెస్ అధికార కాంక్ష

విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో ఐఎన్‌సీ మరియు పీఎంకేలు ధర్మసంకటంలో పడ్డాయి. కాంగ్రెస్ ప్రస్తుతం డీఎంకే (DMK) కూటమిలో ఉండగా, పీఎంకే ఎన్డీయే (NDA) భాగస్వామిగా ఉంది. ఈ దశలో కూటమి ధర్మాన్ని విడిచిపెట్టి విజయ్‌తో చేతులు కలపడం అంటే జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా డీఎంకేతో దశాబ్దాల అనుబంధం ఉన్న కాంగ్రెస్, కేవలం 5 సీట్ల కోసం ఆ బంధాన్ని తెంచుకుంటుందా అన్నది ప్రశ్నార్థకం. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కాబట్టి, తమిళనాడు గద్దెపై విజయ్‌ని కూర్చోబెట్టేందుకు కొత్త కూటములు పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయిన మమతా బెనర్జీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha