Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీ పార్టీ పటిష్టతకు కృషి చేయాలి- ఎమ్మెల్సీ అంజిరెడ్డి

బీజేపీ పార్టీ పటిష్టతకు కృషి చేయాలి- ఎమ్మెల్సీ అంజిరెడ్డి

వార్త 2 months ago

Medak: గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఓబీసీ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సూచించారు.

సోమవారం సంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు కోణంవిట్టల్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఓబీసీ జిల్లా బాధ్యులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వాటి ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ బాధ్యులు అశోక్, సగనాకర్, శ్రీనివాస్, మల్లేశం, అంబదాస్, శ్రీనాథ్, పండరి, రాములు తదితరులు పాల్గొన్నారు.

సన్న వడ్ల బోనస్ కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha