Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. తనతో పాటు మరో ఆరుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు రాఘవ్ చద్ధా మీడియా సమావేశంలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ఇప్పటికే రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.
Read Also: Raghav Chadha: ఆప్ నా నోరు మూయించింది అంటూ ఆవేదన
కేజ్రీవాల్ ఘాటు స్పందన
రాఘవ్ చద్ధా ప్రకటనపై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ మరోసారి పంజాబీలకు వెన్నుపోటు పొడిచిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Raghav Chadha joining BJP
Arvind Kejriwal: బీజేపీలో చేరుతున్న ఎంపీలు వీరే
రాఘవ్ చద్ధాతో పాటు బీజేపీ బాట పట్టిన వారిలో కీలక నేతలు ఉన్నారు. అశోక్ మిట్టల్, విక్రమ్ సింగ్ సాహ్ని, స్వాతి మలివాల్, హర్బజన్ సింగ్, సందీప్ పాఠక్ మరియు రాజిందర్ గుప్తా వంటి ప్రముఖులు ఆప్ నుంచి వీడి బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టమైంది. ఇది ఆప్ జాతీయ రాజకీయాల్లో పెద్ద లోటుగా మారే అవకాశం ఉంది.
ఆపరేషన్ లోటస్ ఆరోపణలు
రాఘవ్ చద్ధాను ఒక పావుగా వాడుకుని తమ పార్టీని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ వర్గాలు ఆరోపించాయి. ఏడుగురు ఎంపీలను తీసుకువస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా రాఘవ్ చద్ధాకు ఆఫర్ ఇచ్చారని ఆప్ నేతలు విమర్శించారు. అయితే, బీజేపీ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది, ఇవన్నీ నిరాధారమైనవని స్పష్టం చేసింది.
నేపథ్యం,అంతర్గత విబేధాలు
రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్ధాను కేజ్రీవాల్ తొలగించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అప్పటి నుంచే ఆయన అసంతృప్తిగా ఉన్నారని, అదే ఇప్పుడు పార్టీని వీడే నిర్ణయానికి దారితీసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

