IAF aircraft crash: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన ఒక విమానం కూలిపోయిందనే వార్తలు సోషల్ మీడియా కొన్ని స్థానిక మీడియా వర్గాల్లో వైరల్‌గా మారాయి.
పద్దర్ ప్రాంతంలోని మారుమూల కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పేర్కొంటున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించి భారత వైమానిక దళం (IAF) నుంచి కానీ, రక్షణ శాఖ నుంచి కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.
Read Also: Vijay TVK Tweet: తమిళనాడు ఎన్నికల్లో 85% ఓటింగ్: విజయ్ సంచలన ట్వీట్
Turmoil in Jammu and Kashmir: Did the plane crash?
IAF aircraft crash: పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి
అనధికారిక నివేదికల నేపథ్యంలో, స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. విమానం కూలిపోయిందని భావిస్తున్న పద్దర్ ప్రాంతానికి అధికారుల బృందం గాలింపు చర్యలకు కొంత సమయం పడుతోందని సమాచారం. ఏదైనా ప్రమాదం జరిగిందా లేదా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అత్యవసర ల్యాండింగ్ జరిగిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఇవి ప్రాథమిక నివేదికలు మాత్రమే కావడంతో, అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రజలు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
"ఢిల్లీ కోటపై దండెత్తుతా!" అన్న మమతా బెనర్జీ.. అమిత్ షా స్పందన ఇదే!

