Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీ సర్కార్‌కు మమతా బెనర్జీ సీరియస్ వార్నింగ్

బీజేపీ సర్కార్‌కు మమతా బెనర్జీ సీరియస్ వార్నింగ్

వార్త 2 months ago

Mamata Banerjee vs BJP: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అక్కడ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, విపక్ష తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం రెండు రోజుల వ్యవధిలోనే టీఎంసీ కీలక ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీలపై రోడ్డుపైనే దాడులు జరగడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అధికార పక్షం తీరుపై మమత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Read Also: Nandu's World Reaction: యూకే వీసా స్కామ్‌పై 'నందు వరల్డ్' జంట షాకింగ్ రియాక్షన్

 Mamata Banerjee vs BJP

కోల్‌కతా సభకు అనుమతి నిరాకరణ.. మమత ఆగ్రహం

బీజేపీ ప్రభుత్వ అణచివేత చర్యలకు నిరసనగా మంగళవారం కోల్‌కతాలోని రాణి రష్మోని రోడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీఎంసీ నిర్ణయించింది. అయితే, ఈ ర్యాలీకి మరియు సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై వర్చువల్ వేదికగా స్పందించిన మమతా బెనర్జీ.. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత నిర్ణయమేనని ఆరోపించారు. బెంగాల్‌లో తమను ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు కూడా చేయనివ్వడం లేదని, ఒకవేళ ఇక్కడ అడ్డుకుంటే తాను నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ఒంటరిగానైనా సరే నిరసన తెలుపుతానని ఘాటుగా హెచ్చరించారు.

Mamata Banerjee vs BJP: రాష్ట్రంలో నడుస్తోంది ‘పోలీసు పాలన’

పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం పూర్తి స్థాయిలో ‘పోలీసు పాలన’ నడుస్తోందని మమతా బెనర్జీ విమర్శించారు. టీఎంసీ రాజకీయ కార్యకలాపాలను అణచివేయడానికి అధికారులు పద్ధతి ప్రకారం బీజేపీకి సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. “మా కార్యకర్తలను సమావేశాలు నిర్వహించనివ్వడం లేదు, మమ్మల్ని బయటకు రానివ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మాకు చెందిన దాదాపు 2,500 పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. ఈద్గాలను స్వాధీనం చేసుకుని, మిషనరీ సంస్థలను బలవంతంగా మూసివేయించారు” అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ప్రభుత్వం బెదిరింపులు, అక్రమ అరెస్టుల ద్వారా టీఎంసీని బలహీనపరచాలని చూస్తోందని, కానీ తాము మరింత బలంగా ఎదుగుతామని మమత స్పష్టం చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి లాక్కున్నంత మాత్రాన టీఎంసీకి వచ్చిన నష్టమేమీ లేదని, ప్రజాక్షేత్రంలోనే తాము బీజేపీ అరాచకాలను ఎండగడతామని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు.. వివాహిత కుమార్తెలకూ కారుణ్య నియామకాలు వర్తిస్తాయి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha