Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీమా డబ్బు కోసం భర్తను హత్య చేయించిన భార్య

బీమా డబ్బు కోసం భర్తను హత్య చేయించిన భార్య

వార్త 2 weeks ago

Mancherial insurance murder case: మంచిర్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అది ప్రమాదం కాదు..

పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర హత్య అని పోలీసులు తేల్చారు. సుమారు రూ.2 కోట్ల భారీ బీమా (ఇన్సూరెన్స్) సొమ్మును దక్కించుకోవడానికి, అలాగే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ భార్య, తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే సుపారీ ఇచ్చి అంతమొందించింది.

 wife killed husband with lover for insurance money

యాక్సిడెంట్‌గా చిత్రీకరణ.. తల్లి అనుమానంతో బయటపడ్డ !

హాజీపూర్ మండలం గూడిపేట ప్రాంతానికి చెందిన శైని కుమార్ (45) మే 22వ తేదీన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు మొదట భావించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతుడి తల్లి లక్ష్మి వ్యక్తంచేసిన అనుమానాల ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. లోతుగా దర్యాప్తు చేయగా, శైని కుమార్ భార్య భారతికి అదే గ్రామానికి చెందిన సురేందర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. వీరిద్దరూ కలిసి భర్తను వదిలించుకోవాలని స్కెచ్ వేశారు.

Read also: Mahabubnagar ATM Theft:ఏటీఎం నే ఎత్తుకెళ్లారు..!

Mancherial insurance murder case:రూ.10 లక్షల సుపారీ.. సుత్తితో తలపై బాది హతం!

భర్తను చంపేందుకు భారతి, సురేందర్‌లు రామ్ మల్లేష్ అనే వ్యక్తికి రూ.10 లక్షల సుపారీ మాట్లాడి, అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు చేతిలో పెట్టారు. పథకంలో భాగంగా మే 22న శైని కుమార్‌కు నిందితులు మితిమీరి మద్యం తాగించారు. ఆ తర్వాత ఇనుప సుత్తితో తలపై బలంగా బాది హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, ఇదంతా రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు మృతదేహాన్ని, అతని మోటార్ సైకిల్‌ను రహదారిపై పడేసి అక్కడి నుంచి పారిపోయారు.

ముగ్గురు నిందితుల అరెస్ట్.. ఒకరు పరారీ!

ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ మంగళవారం మీడియా సమక్షంలో వెల్లడించారు. భర్తను చంపించిన భార్య భారతి, ఆమె ప్రియుడు సురేందర్‌తో పాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన శ్రీరామ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామ్ మల్లేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు కారణమైన బీమా పత్రాలను, రూ.25 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

ట్విషా శర్మ భర్త నోట సంచలన విషయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha