AP Govt : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల (BC) నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
బీసీ యువత ఒక్క రూపాయి కూడా సొంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండానే జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం రూ. 7.92 కోట్లను విడుదల చేసింది. బి.ఫార్మసీ (B.Pharmacy), డి.ఫార్మసీ (D.Pharmacy) పూర్తి చేసిన అర్హులైన యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 198 జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు గాను ఈ నిధులను కేటాయించారు. ఈ పథకం ద్వారా విద్యార్హత కలిగిన బీసీ యువతకు సొంతంగా వ్యాపారం ప్రారంభించే గొప్ప అవకాశం లభించనుంది.
CM Chandrababuఆర్థిక సాయం మరియు లోన్ విధానం: సబ్సిడీతో రూ. 8 లక్షల ఉపాధి పథకం
ఈ పథకం కింద ఒక్కో జనరిక్ మెడికల్ షాపు ఏర్పాటుకు రూ. 8 లక్షల వరకు నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందులో లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, సగం మొత్తం అంటే రూ. 4 లక్షలను ప్రభుత్వం నేరుగా సబ్సిడీ రూపంలో బ్యాంకులకు అందిస్తుంది. మిగిలిన రూ. 4 లక్షల మొత్తాన్ని బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే లబ్ధిదారుడికి రుణం (Loan) రూపంలో ఇప్పిస్తారు. ఎలాంటి సొంత పెట్టుబడి లేకుండా వ్యాపారంలో స్థిరపడేందుకు వీలు కల్పిస్తున్న ఈ ఉపాధి పథకం పట్ల రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ ఫార్మసీ యువత తీవ్ర హర్షం వ్యక్తం చేస్తోంది.

