Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి పిల్లలకు ఇచ్చిన తల్లి

బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి పిల్లలకు ఇచ్చిన తల్లి

వార్త 2 weeks ago

Gandhi Nagar incident: ఇద్దరు పిల్లలు విషమిచ్చి తల్లి ఆత్మహత్య యత్నం. ఖమ్మం పట్టణంలో గాంధీ నగర్ లో బిస్కెట్లలో ఎలుకలమందు పెట్టి.. పిల్లలకు ఇచ్చిన తల్లి, వేదకుమార్ (7) తనీష్ (5) మృతి.

తల్లి పరిస్థితి విషమం.కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు .కుటుంబ కలహాలతో దారుణం ఖమ్మం గాంధీ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దంపతులకు వేదకుమార్ (7), తనీష్ (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ విషయాల పరంగా దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఈ ఘోరం జరిగింది. పిల్లలు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మరణించారు.

 Children die due to the Khammam Gandhinagar incident.

స్థానికంగా విషాద ఛాయలు

ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గొడవలే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు చెబుతున్నారు. తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులు కన్నుమూయడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Gandhi Nagar incident: దర్యాప్తులో పోలీసులు

పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. మృతుల కుటుంబ నేపథ్యం, దంపతుల మధ్య గొడవలకు గల అసలు కారణాలను సేకరిస్తున్నారు. చిన్నారుల మృతికి కారణమైన పరిస్థితులపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాల వల్ల కన్నబిడ్డలనే పొట్టనబెట్టుకున్న ఈ ఘటన ఖమ్మం నగరంలో చర్చనీయాంశంగా మారింది

Epaper: epaper.vaartha.com

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha