Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీటెక్ విద్యార్థి 'పరువు' హత్య..

బీటెక్ విద్యార్థి 'పరువు' హత్య..

వార్త 3 months ago

Sitaphalmandi Crime: హైదరాబాద్ నగరంలోని సీతాఫల్‌మండిలో జరిగిన ఈ దారుణ హత్య ఉదంతం పరువు హత్యల క్రూరత్వాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్, గత నాలుగేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.

వీరి ప్రేమ వ్యవహారం ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు అతడిని గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ, యావన్ సీతాఫల్‌మండిలోని తన స్నేహితుడి గదిలోనే నివసిస్తూ తరచూ యువతిని కలుస్తుండేవాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్న యువతి బంధువులు, అతడిని అడ్డుతొలగించుకోవాలని కిరాతకమైన పథకం వేశారు.

Read Also :Ashu Reddy Case:రూ. 9.35 కోట్ల మోసం కేసులో పోలీసుల నోటీసులు!

Sitaphalmandi Crime: దాడి జరిగిన తీరు

నిన్న రాత్రి యావన్ బయటకు వచ్చిన సమయంలో ఆరుగురు దుండగులు మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చి మాటు వేశారు. యావన్‌ను చూడగానే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయగా, అతను ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశాడు. అయితే నిందితులు అతడిని వదలకుండా వెంబడించి నడిరోడ్డుపై పడేశారు. కసితీరా యావన్‌ను 17 చోట్ల కత్తితో పొడవడంతో, తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. జనం చూస్తుండగానే జరిగిన ఈ మృత్యుకాండ స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

పోలీసుల చర్యలు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. నగర నడిబొడ్డున జరిగిన ఈ పరువు హత్య శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా, ప్రేమ వ్యవహారాల్లో సమాజంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా నిలిచింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సమ్మర్ ఇంటర్న్‌షిప్ పేరిట బాలికలను ట్రాప్ చేస్తున్న నిందితుడి గుట్టురట్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha