Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సమ్మర్ ఇంటర్న్‌షిప్ పేరిట బాలికలను ట్రాప్ చేస్తున్న నిందితుడి గుట్టురట్టు

సమ్మర్ ఇంటర్న్‌షిప్ పేరిట బాలికలను ట్రాప్ చేస్తున్న నిందితుడి గుట్టురట్టు

వార్త 3 months ago

Online Scams: సమ్మర్ ఇంటర్న్షిప్ పేరిట బాలికలను ట్రాప్ చేస్తున్న నిందితుడి గుట్టురట్టు 2019లో కరోనా మహమ్మారితో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది.

దీంతో దాదాపు ప్రపంచంలోని అన్నిదేశాలు లాక్ డౌన్ దిశగా నడిచాయి. ఇక విద్యార్థులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఆన్ లైన్ క్లాసులకు అనుమతినిచ్చాయి. దీంతో పిల్లలు తప్పనిసరిగా కంప్యూటర్, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను వాడాల్సి వచ్చింది. ఇక అప్పటినుంచి విద్యార్థులకు, పిల్లలకు సెల్ ఫోన్లతో విపరీతమైన అనుబంధం పెరిగిపోయింది. అయితే ఈ ఫోన్లే పిల్లల జీవితాలను పాడుచేస్తున్నాయి. దీన్ని ఆసరగా చేసుకుని, కొంతమంది ప్రబుద్ధులు పిల్లల్ని ప్రత్యేకంగా ఆడపిల్లల్ని ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read also: Kannauj Crime: కన్నౌజ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం!

 Honey Trap Under the Guise of a Summer Internship

Online Scams: సోషల్ మీడియాలో పరిచయం ప్రాణసంకటం

ఆన్ లైన్ క్లాసులంటూ, సమ్మర్ క్లాసులంటూ పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి, వారిని ట్రాప్ చేసేందుకు యత్నిస్తున్నారు. తాజాగా ఓ నిందితుడు ఇలాంటి మోసానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సమ్మర్ ఇంటర్న్షిప్ పేరిట మోసం సమ్మర్ ఇంటర్న్షిప్ పేరిట ఓ నిందితుడు వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి, బాలికలను ట్రాప్ చేయడం కలకలం రేపుతున్నది. ప్రత్యేకంగా సంపన్న వర్గాల అమ్మాయిలను హనీ ట్రాప్ చేసిన చంద్రశేఖర్ కేసులు పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇన్ స్టాగ్రామ్ బయోలో ఫిల్మ్ ప్రొడ్యూసర్ అంటూ పెట్టుకుని, సమ్మర్ ఇంటర్న్షిప్ పేరిట వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు చంద్రచేశకర్ ఆజాద్. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి నేరుగా వాట్సాప్ గ్రూప్ ఓపెన్ అయ్యేలా లింక్ పెట్టి, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తామని, రూ. 2నవేలు స్టైఫండ్ ఇస్తామని అమ్మాయిలకు వల వేశాడు. వాట్సాప్ గ్రూప్ లో చేరిన బాలికలను ట్రాప్ చేసి మోసం చేసిన అర్జున్ (చంద్రశేఖర్ ఆజాద్) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాబట్టి అమ్మాయిలు మీరు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఇలాంటి ఆన్ లైన్ మోసాలలో పడకుండా నిత్యం మీ పిల్లలపై నిఘా ఉంచాలని పోలీసులు వాచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టీసీఎస్ మతమార్పిడి కేసు: నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha