Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బియ్యం ధరలపై సర్కార్ ఉక్కుపాదం.. విజిలెన్స్ వరుస మెరుపు దాడులు

బియ్యం ధరలపై సర్కార్ ఉక్కుపాదం.. విజిలెన్స్ వరుస మెరుపు దాడులు

వార్త 3 weeks ago

Rice Prices: తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపట్టింది. బియ్యం అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.

ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ విభాగం, మెట్రాలజికల్ శాఖ, జీఎస్‌టీ అధికారులు సంయుక్తంగా హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజు కూడా విస్తృత మెరుపు దాడులు నిర్వహించారు.

AP: ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా తనిఖీలు

విజిలెన్స్ అండ్ పౌరసరఫరాల టాస్క్‌ఫోర్స్ టీమ్ హెడ్ శశిధర్ రాజు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు నగరంలోని పలు కీలక ప్రాంతాలపై దాడి చేశాయి. మంగళహాట్, మలక్‌పేట, అమీర్‌పేటతో పాటు పలు ప్రధాన ధాన్యపు మార్కెట్లు, గోదాముల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వ్యాపారుల వద్ద ఉన్న స్టాక్ రిజిస్టర్లు, అసలు నిల్వలను నిశితంగా పరిశీలించారు.

కృష్ణా నగర్ నీలం రైస్ డిపోలో విస్తుపోయే అక్రమాలు

తనిఖీల్లో భాగంగా కృష్ణా నగర్ కమలాపురి కాలనీలోని ‘నీలం రైస్ డిపో’లో సోదాలు నిర్వహించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి భారీగా అక్రమ బియ్యం నిల్వలు ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి ఊరు, పేరు, చిరునామా లేని నకిలీ బ్రాండ్ల పేరిట సాధారణ బియ్యాన్ని ప్యాక్ చేసి, ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.

బయటపడ్డ అక్రమాలు

సోదాల సందర్భంగా డిపోలలో జరుగుతున్న పలు అక్రమాలను అధికారులు పూసగుచ్చినట్లు వెల్లడించారు.
పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, పునరుద్ధరించి (రీసైక్లింగ్) బహిరంగ మార్కెట్లోకి తరలిస్తున్నారు. నాసిరకం బియ్యాన్ని అత్యాధునిక ప్యాకింగ్, ఆకట్టుకునే బ్రాండ్ పేర్లతో సన్న బియ్యంగా భ్రమింపజేసి అమ్ముతున్నారు. బియ్యం సంచుల్లో తూకాల్లో తేడాలు ఉండటంతో పాటు, రసీదులు సరిగ్గా ఇవ్వకుండా భారీగా జీఎస్‌టీ పన్నులను ఎగవేస్తున్నట్లు తేలింది.

అక్రమ నిల్వలకు పాల్పడినా, కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరలు పెంచేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని, ఇటువంటి తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

Epaper: epaper.vaartha.com

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. బియ్యం ధరలపై ప్రభుత్వం కీలక ప్రకటన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha