Fee collection : తామేం చేసినా చెల్లుతుంది కనుక ఎవరు నవ్వుకున్నా. విమర్శలు రువ్వుకున్నా తమకేటి సిగ్గు అన్న చందా న తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యా పారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.
ప్రధానంగా విద్యార్థుల ఫీజుల విషయంలో కళాశాల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఒక భావకవి కలం లోంచి వచ్చిన పద విన్యా సమొకటి గుర్తొస్తోంది. తామేదో విద్యాసేవ చేస్తున్నట్లు గొప్పగా చెప్పుకునే ఆయా విద్యాసంస్థలపై వస్తున్న అభి యోగాలు చూస్తోంటే నవ్వుకోవాల్సిందే! అందరికీ తమ తీరు తెలిస్తే నవ్వుల పాలవుతామనే ఆలోచన కూడా లేకుండా ఫీజుల వసూళ్లలో విచ్చలవిడిగా విధానాలు అవలంబిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వృత్తి విద్యాకోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను అడిగితే ఆయా కళాశాలల యాజమాన్యాలు పెడ్తున్న షరతులు ఏ విద్యా ర్దికీ సంతృప్తి నిచ్చేవి కావు. ఫీజు రీయింబర్స్మెంట్ పథ కంలో చదువుకున్న విద్యార్థులు తాజాగా కాలేజీ యాజ మాన్యాలకు తమ అసలు ధ వపత్రాల కోసం బ్లాంక్ చెట్లు, ప్రామిసరీ నోట్లు సమర్పించుకోవాల్సి వస్తోంది. తమ కోర్సు పూర్తి చేసుకున్నాక ఉన్నత విద్యాకోర్సుల్లో చేరాలంటే లేదా విదేశీ చదువుల కోసం ముందుకు సాగా లంటే ఒరిజినల్ డిగ్రీ పత్రాలు కావాలి. పైగా తాము ప్రస్తుతం చదువుతున్న క ళాశాలలోనే క్యాంపస్ సెలక్షన్ల లో ఎంపికయినా కూడా వారు ఉద్యోగ ప్రస్థానంలో అడుగు పెట్టే సందర్భంగా ఒరిజినల్స్ నమోదు చేయించు కోవాలి. అందుకోసం వాటిని దఖలు పరచాలి.
Fee collection
Fee collection : ఫీజులు చెల్లిస్తే ఒక పద్ధతి, చెల్లిం చకపోతే మరో పద్దతి
గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సకాలంలో విడుదల చేసిన పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో ఈ యేడాది ఇంజినీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సులో పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టి ఫికేట్లు ఇవ్వలేదు. విద్యార్థి కోర్సులు పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వం సదరు విద్యార్థుల అక్కౌంట్కు ఫీజు రీయిం బర్స్ మెంట్ జమ చేయకపోవడంతో ఈ యేడాది విద్యా ర్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వం నుంచి ఆ బకాయిలను వసూలు చేసుకోలేక విద్యార్థుల భవిష్యత్తో ముడిపెడితే తమ ఖజానాలోటు నిండుతుందని ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు భావించిన తక్షణమే అమలులో పెట్టాయి. అందుచేతనే ఫీజులు చెల్లిస్తే ఒక పద్ధతి, చెల్లిం చకపోతే మరో పద్దతిని అనుసరిస్తున్నాయి. ప్రభుత్వ భరోసాతో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు మరో మార్గాంతరం లేక లబోదిబో అంటున్నారు. ఫీజు బకా యిలు చెల్లించాల్సింది ప్రభుత్వం కానీ ఒరిజినల్ సర్టి ఫికేట్లు అడిగితే, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయి ఫలానా తేదీలోగా ఫీజు రాకపోతే తామే చెల్లిస్తామన్న హామీ పత్రాలతోపాటు అందుకు చెల్లుబాటు ప్రామిసరీ నోట్లు, బ్యాంక్ చెక్ లు రాయించుకుంటున్నారు. ఇదో దుర్విధానం. ఇలాంటి విధానాలను నిలుపుదల చేయడం కోసం రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేకమైన చర్యలేమీ తీసుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ యేడాది 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఫీజులను వసూలు చేసి, ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేసినప్పుడు విద్యార్థు లకు ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని సూచించింది.
పాత పద్ధతి అమల్లో ఉన్నట్లే..
అసలు చదువుకునే స్తోమత లేని విద్యార్థుల కోసమే ఫీజురీయిం బర్స్మెంట్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా ఇప్పుడా విధానాన్ని మార్చేస్తే ఆ విద్యాపథకం స్ఫూర్తి దెబ్బతిం టుంది. ఈ పథకంతో ఇప్పటికే గత పదేళ్లుగా ఎంతో మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు వృత్తి విద్యా కోర్సు లలో చేరితమ జీవితాలు పండించుకుంటున్నారు. ఇప్పుడా పథకాన్ని ఆపినా, హైకోర్టు సూచనలతో ఎవరి ఫీజులు వారు కట్టేసి మళ్లీ ప్రభుత్వం నుంచి విద్యార్థులు వసూలు చేసుకోవడం సరైనపద్ధతి కాదు. దాంతో ఫీజులు కట్టుకో లేనివారు, నిరాశానిస్పృహలతో తమ జీవితాలను వెలి బుచ్చాల్సి ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వులు వెంబడి ప్రభు త్వం కూడా ఓ విచిత్రమైన జి.ఓ ఇచ్చింది. 2026-27 విద్యాసంవత్సరంలో విద్యార్థులకు నేరుగానే ఫీజు రీయిం బర్స్మెంట్ చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ ప్రభుత్వం ప్రతి యేటా ఏయే సమయాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించగలదో స్పష్టత లేక హైకోర్టు ఎలాంటి కొత్త ఉత్తర్వులు ఇవ్వలేదు. పాత పద్ధతి అమల్లో ఉన్నట్లే. ఈలోగా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చెల్లించే విషయంలో చొరవ చూపలేదు. కళాశాలలు చేసేది లేక విద్యార్థుల పేరిట ఉన్న ఫీజు బకాయిలు వారి నుంచే వసూలు చేయాలన్న ధోరణితో బ్లాంక్ చెట్లు, ప్రామిసరీ నోట్లు సేకరణ విధానాన్ని చేపట్టింది. ఇలాంటి విధానం దేశంలోని ఏ యూనివర్సిటీ, కళాశాలలు అవలంబించడం లేదు.
Fee collection
ఒరిజినల్ సర్టిఫికేట్ లకు లింకు
తెలంగాణ కళాశాలలు ఎన్నుకున్న పద్ధతి చర్చనీ యాంశమైంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడు దల చేయక పోతే తాము కళాశాలలను నడపలేమని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ముందుగానే హెచ్చ రించాయి. బంద్ పాటించడంతో ప్రభుత్వం కొంతమేరకు ఫీజు రీయిం బర్స్ మెంట్ నిధులు విడుదల చేసింది. గత మూడేళ్లుగా ఆయా కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజుబకా యిలు దాదాపు పదివేల కోట్ల రూపాయల వరకు ఉండగా కంటి తుడుపుగా రూ.400 కోట్లు విడుదల చేసి ప్రభు త్వం మిన్నకుంది. ఇక కొత్త విద్యాసంవత్సరం మొదల య్యింది. కథ మామూలే. పెరిగిపోతున్న బకాయిలు వచ్చే మార్గం లేదు. కనీసం విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్ లకు లింకు పెడితే నైనా కొన్ని నిధులు రాబట్టుకోగలమని కళాశాల యాజమా న్యాలు చేపట్టిన వసూళ్ల విధానం విద్యార్థుల విదేశీ చదువులు, ఉపకార వేతనాలకు దూరమయ్యే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ భరోసాతో విద్య పూర్తయిందన్న ఆనందమే లేకుండా మరో ఉన్నత చదువులకు ఆటంకాలేర్పడుతున్నాయని ఆందోళనలో గత యేడాది విద్యాయాత్ర ముగిసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

