Vizianagaram News: హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, పట్టణ ప్రజలు మరియు అన్ని పార్టీల నాయకులు.
దేశభక్తి నినాదాలతో హోరెత్తిన బొబ్బిలి పట్టణం.
Read Also :AP dwacra loans: డ్వాక్రా మహిళలకు రూ.3 లక్షల స్త్రీనిధి లోన్


గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా “హర్ ఘర్ తిరంగా ర్యాలీ” నిర్వహిస్తున్నారు.. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బొబ్బిలి పట్టణంలో శ్రీ హనుమాన్ సేవాసమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా “తిరంగా ర్యాలీ” నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు ముఖ్య అతిథిగా పాల్గొని, బొబ్బిలి పట్టణ పురవీధులలో విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు..దేశభక్తి నినాదాలతో విద్యార్థులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Vizianagaram News: ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మాట్లాడుతూ, విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాద్యత అని అన్నారు. జాతీయ జెండా ఔన్నత్యాన్ని, దేశ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని సూచించారు.. అలానే, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.



