Perni Nani: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్షా శిబిరంపై తెలుగుదేశం పార్టీ వర్గాలు దాడి చేసి టెంట్‌ను తొలగించడంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు.
ఈ ఘటనపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతూ అధికార పార్టీ తీరును తప్పుబట్టారు.

ఎమ్మెల్యే బొండా ఉమాపై తీవ్ర విమర్శలు
స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమ తన అధికార మదంతో రౌడీ మూకలను వెనకేసుకొచ్చి ఈ దాడులకు పాల్పడ్డారని పేర్ని నాని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో అధికార పార్టీ నేతలే స్వయంగా ఇటువంటి దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని, ఇది రాజకీయ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందని విమర్శించారు.
Perni Nani: చంద్రబాబు, లోకేష్‌లపై విసుర్లు
బొండా ఉమా లాంటి వారిని ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ లు శునకానందం పొందుతున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అయితే ఈ తాత్కాలిక ఆనందం ఎంతో కాలం నిలవదని, పాలకుల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పురాణాల్లో శిశుపాలుడి పాపాలు పండినట్లుగానే, ప్రస్తుత కూటమి ప్రభుత్వ అక్రమాలు, పాపాలను ప్రజలు లెక్కగడుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇళ్లకు వచ్చి కొడతామని బెదిరింపులకు దిగుతున్నారని, మీ చేతనైంది చేసుకోండి చూస్తామంటూ ఆయన తీవ్రమైన సవాల్ విసిరారు.
అమరావతికి కేంద్ర విద్యాసంస్థ 'నీలిట్' - దేశంలోనే తొలి క్వాంటమ్, ఏఐ యూనివర్సిటీ

