Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బోరంచ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న నైనా జైస్వాల్!

బోరంచ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న నైనా జైస్వాల్!

వార్త 2 months ago

Naina Jaiswal TT Player: నారాయణఖేడ్: మానూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బోరంచ గ్రామంలో వెలిసిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (TT) క్రీడాకారిణి నైనా జైస్వాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

ఆదివారం ముందుగా నైనా జైస్వాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారి స్వగృహానికి విచ్చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, అనుపమ దంపతులు మరియు నైనా జైస్వాల్ కలిసి బోరంచ గ్రామంలోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లారు.

Read Also: Indiramma Housing Scheme : రేపు 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు CM శ్రీకారం

ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించి, వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తిని చాటిచెప్పిన నైనా జైస్వాల్(Naina Jaiswal TT Player) గారు మన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రముఖ క్షేత్రమైన బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషకరమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

 Naina Jaiswal performed special prayers at the Borancha Nalla Pochamma Temple.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శివ రుద్రప్ప, సర్పంచ్ బీరప్ప, అర్చకులు శ్రీకాంత్ స్వామి, సిద్దు స్వామి, నాగయ్య స్వామి, ప్రవీణ్ స్వామి, శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి, శేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వాల్మీకి అవార్డులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha