Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల పథకం' శరవేగంగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రేపు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదటగా కొత్తగూడ గ్రామానికి చేరుకుని, అక్కడ మొదటి విడత కింద విజయవంతంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి భారీ సామూహిక గృహప్రవేశాల మహోత్సవంలో పాల్గొంటారు. సొంత ఇంటి కల సాకారమైన పేద కుటుంబాల సంతోషాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఇప్పటికే మొదటి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.50 లక్షల మంది అర్హులైన పేద ప్రజలకు ఇళ్లను మంజూరు చేసిన ప్రభుత్వం, వాటి నిర్మాణాలను అంతే వేగంగా పూర్తి చేయించి లబ్ధిదారులకు అందిస్తోంది.
Read Also : తెలంగాణలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడగింపు

కాగజ్‌నగర్ వేదికగా రెండో విడతకు శ్రీకారం
కొత్తగూడలో గృహప్రవేశాల కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగజ్‌నగర్ పట్టణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని, ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత (Phase 2) నిర్మాణ పనులకు ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ రెండో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల మంజూరుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. సభకు జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పరిసర ప్రాంతాలలో పర్యటించి భద్రత మరియు సభా ప్రాంగణ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

