Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రహ్మణి స్టీల్స్ భూములు వెనక్కి.. విలువ రూ.5వేల కోట్లు!

బ్రహ్మణి స్టీల్స్ భూములు వెనక్కి.. విలువ రూ.5వేల కోట్లు!

వార్త 1 month ago

Brahmani Steels lands : ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాలో గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన 'బ్రహ్మణి స్టీల్స్' భూములను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకుంది.

గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2007వ సంవత్సరంలో కర్ణాటకకు చెందిన ప్రముఖ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రహ్మణి స్టీల్స్ పరిశ్రమ స్థాపన కోసం ప్రభుత్వం సుమారు 13,000 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, భూములు కేటాయించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి పనులు చేపట్టలేదు. పరిశ్రమలు పెట్టి స్థానికులకు ఉపాధి కల్పిస్తామనే ప్రధాన నిబంధనను పూర్తిగా ఉల్లంఘించడంతో పాటు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లనే ఈ భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది.

భూముల తాకట్టు వివాదం.. రూ.5,000 కోట్ల విలువైన రికార్డుల మార్పిడి

ఈ భూముల వ్యవహారంలో కేవలం పరిశ్రమ స్థాపించకపోవడమే కాకుండా, మరో పెద్ద వివాదం కూడా తెరపైకి వచ్చింది. ప్రభుత్వం కేటాయించిన భూములను కమర్షియల్ బ్యాంకులలో తాకట్టు పెట్టి బ్రహ్మణి స్టీల్స్ యాజమాన్యం దాదాపు రూ. 350 కోట్ల మేర రుణాలు (Loans) పొందడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడంపై చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారించిన అనంతరం.. కడప జిల్లా కలెక్టర్ ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు (GO) జారీ చేశారు. ప్రస్తుతం ఈ 13 వేల ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వ రికార్డులలో చేర్చారు. మార్కెట్ ధరల ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ. 5,000 కోట్ల పైమాటే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ముంబైకి పవన్ కల్యాణ్..భుజం నొప్పికి సర్జరీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha