తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడి గుడ్ల (Chicken & Eggs) ధరలు ఒక్కసారిగా పెరిగాయి.. మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, ఫీడ్, రవాణా ఖర్చులు అధికమవడం వంటి కారణాలతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
గత నెల రోజులుగా ఈ ధరల పెరుగుదల కొనసాగుతోంది.గుడ్ల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజన పథకంపై కూడా ప్రభావం పడుతోంది. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.260-280, ఒక్క గుడ్డు ధర రూ.10కి చేరింది.
AP: నకిలీ మద్యం కేసు.. నిందితులకు మూడు రోజులపాటు కస్టడీ

గుడ్ల ధరల పెరగడానికి కారణాలేంటి?
గత కొద్దిరోజులుగా కోడిగుడ్లు, చికెన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం ముగియడం, వరుస పండుగలు రావడంతో మాంసాహారానికి ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లుగా పౌల్ట్రీ ఉత్పత్తి లేకపోవడంతో సరఫరా దెబ్బతింది.
వచ్చే నెలలో సంక్రాంతి ఉండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్ల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6 మాత్రమే చెల్లిస్తోంది. కానీ మార్కెట్‌లో హోల్‌సేల్ ధర రూ. 7.50 ఉండగా, రిటైల్ ధర రూ. 10 పలుకుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

