California Almonds benefits : నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది అల్పాహారం (Breakfast) మానేయడం లేదా పోషకాలు లేని ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం చేస్తుంటారు.
ఈ సమస్యకు పరిష్కారంగా దైనందిన జీవితంలో పెద్దగా మార్పులు చేయకుండానే అల్పాహారంలో కాలిఫోర్నియా బాదంపప్పులను చేర్చుకోవడం ఒక సులువైన మరియు అద్భుతమైన మార్గమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కాలిఫోర్నియా బాదంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం మరియు విటమిన్ 'ఇ' తో పాటు ఏకంగా 24 రకాల అవసరమైన పోషకాలు నిండి ఉంటాయి. రోజు ప్రారంభంలోనే వీటిని తీసుకోవడం వల్ల రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉండటమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగిస్తూ అతిగా తినే అలవాటును నివారిస్తుంది.

మెరుగైన ఆరోగ్యం & రోగనిరోధక శక్తి: నిపుణులు, ప్రముఖుల అభిప్రాయాలు
కాలిఫోర్నియా బాదంలో ఉండే పాలీఫెనాల్స్ జీర్ణకోశ ఆరోగ్యానికి తోడ్పడగా.. ఇందులోని విటమిన్ ఇ, జింక్, ఐరన్ మరియు కాపర్ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. శారీరక శ్రేయస్సుకు కఠినమైన డైటింగ్ అవసరం లేదని, క్రమం తప్పకుండా పాటించగలిగే ఆచరణాత్మక మార్పులే ముఖ్యమని న్యూట్రిషన్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మరియు మ్యాక్స్ హెల్త్‌కేర్ రీజినల్ హెడ్ రితికా సమద్దర్ స్పష్టం చేశారు. అలాగే ప్రముఖ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఎంత బిజీగా ఉన్నా తన దినచర్యలో సులభంగా కలిసిపోయే కాలిఫోర్నియా బాదంపప్పులను అల్పాహారంగా తీసుకోవడమే తన నిత్య ఉత్సాహానికి రసాయనిక పునాది అని పేర్కొన్నారు. యుఎస్డిఎ (USDA) పర్యవేక్షణలోని 'ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా' పరిశోధనాత్మక విధానంతో సహజమైన, నాణ్యమైన బాదంపప్పుల వినియోగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తోంది.

