Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రిటన్ గడ్డపై తెలంగాణ బిడ్డకు కీలక పదవి

బ్రిటన్ గడ్డపై తెలంగాణ బిడ్డకు కీలక పదవి

వార్త 3 months ago

Hema Ellapragada UK Council Member: తెలంగాణ గడ్డ నుంచి వెళ్లి విదేశీ రాజకీయాల్లో సత్తా చాటుతున్న హనుమకొండ బిడ్డ హేమ ఎల్లాప్రగడ అరుదైన గౌరవం దక్కించుకున్నారు.

యూకేలోని వార్విక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌లో, క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా ఆమె నియమితులవ్వడం తెలుగువారందరికీ గర్వకారణం. స్థానిక నగరాల పాలనలో కీలకమైన డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్‌లో హేమ ఎల్లాప్రగడకు దక్కిన ఈ పదవి ఆమె రాజకీయ నైపుణ్యానికి నిదర్శనం.

Read Also:Revanth Reddy: నేడు శ్రీ సీతారాముల కళ్యాణలో పాల్గొననున్న సీఎం రేవంత్

 Hema Ellapragada Warwick Council Member

రాజకీయ ప్రయాణం

2023లో గ్రీన్‌ పార్టీ సభ్యురాలిగా ఎన్నికైన ఆమెకు డీకార్బనైజేషన్‌ బాధ్యతలు అప్పగించారు. స్థానిక నగరాల్లో పాలన సాగించే డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్స్‌లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీ నేతను లీడర్‌ ఆఫ్‌ ది కౌన్సిల్‌గా పిలుస్తారు. సభ్యుల్లో కొందరిని క్యాబినెట్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా ఎంపిక చేసి వివిధ పరిపాలనా విభాగాలను అప్పగిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్ లో సాధారణ స్థితికి చేరుకున్న పెట్రోల్ బంకులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha