Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు తునికి గ్రామంలో అపశృతి

BRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు తునికి గ్రామంలో అపశృతి

వార్త 5 months ago

Medak: మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు జెండా ఆవిష్కరణ చేయడానికి వెళ్ళగా అపశృతి చోటు చేసుకుంది.

గుర్తుతెలియని వ్యక్తులు బిఆర్ఎస్ పార్టీ గద్దెను కూల్చివేయడం జరిగింది. దీంతో తునికి గ్రామంలో తీవ్ర ఉధృత వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్ పార్టీ గద్దెను కూల్చింది ఎవరని ఆరా తీయగా కాంగ్రెస్ కార్యకర్తలైన తలారి భూపాల్, ఆరెగూడెం శ్రీశైలం మరో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు బి.ఆర్.ఎస్ పార్టీ గద్దర్ కూల్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో బి ఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం తో పాటు తోపులాట జరిగింది.

Read Also : May Day 2026: మేడేను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్

 Medak: Disturbance in Tuniki village on BRS party formation day

విషయం తెలిసిన వెంటనే నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి, నర్సాపూర్ ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి లు పోలీస్ బలగాలతో ఘటన స్థలానికి చేరుకొని ఇరు పార్టీల కార్యకర్తలను చల్లా చెదురు చేసి ఉదృతవతావని శాంతింప చేశారు. కాగా తునికి గ్రామంలోని చర్చి వద్ద గత 15 ఏళ్ల క్రితం బి ఆర్ఎస్ పార్టీ గద్దెను నిర్మించి ప్రతి ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజు పార్టీ జెండా ఆవిష్కరి చేసేవారు. గద్దె స్థలం ఆరెగూడెం శ్రీశైలం, తలారి భూపాలకు చెందినందున బి ఆర్ఎస్ పార్టీ గద్దెను కూల్చివేసామని వారు తెలిపారు. ప్రస్తుతం వారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కొనసాగుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డిలు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తెలంగాణలో 'నో స్టాక్' బోర్డులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha