May Day 2026: మే డే ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంఏ.రెహమాన్ కోరారు. మే డేను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లాపుల్కల్లో ఆదివారం పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో 1886 మే 1వ తేదీన పని గంటలు తగ్గించాలని, పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రతా కల్పించి, కార్మికుల కనీస వేతనాలు చెల్లించాలని, కార్మికులపై యజమాన్యాల వేధింపులు అరిగట్టాలని 1886లో మహత్తరమైన పోరాటం జరిగిందన్నారు. ఆ పోరాటంలో అనేక మంది కార్మికులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఆ నెత్తుటి మరకల బట్టలతోనే కార్మికుల ఎర్ర జెండా ఏర్పడిందని.
May Day 2026: భారీగా తరలిరండి
ఆనాటి నుండి నేటి వరకు ఎర్రజెండా చేతబట్టి కార్మికుల పోరాటాలు నిర్వహించి హక్కులను సాధించుకుంటున్నారని పేర్కొన్నారు. నేటి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలలో నుండి గుండెకాయ లాంటి 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చిందని ఆరోపించారు. ఈ కోడ్ల వల్ల కార్మికుల పని గంటలకు 8 గంటల నుండి 12 గంటలకు పెంచి సమ్మె హక్కును తొలగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
ఏఐటీయూసీ అధ్వర్యంలో నిర్వహించే మేడే ఉత్సవాలకు కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెంకటరాజ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు శివశంకర్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ పుల్కల్, చౌటకూర్ మండలాల కార్యదర్శులు విజయకుమార్, దుర్గారావు, రాములు, రాజు, నారాయణ, భూమయ్య, సాజీద్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

