Budhera Flyover Accident: మునిపల్లి మండలంల బుదేరా చౌరస్తాలోని ఫ్లైఓవర్ పై కారు లారీని వెనుక నుంచి ఢీ కొనడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
వివరాలలోకి వెళ్తే… కర్ణాటకలోని హుమనాబాద్ కు చెందిన బషీర్ (26) తన సమీప బంధువు పెళ్లి హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి జరుగవల్సి వుంది. పెళ్లి కొడుకుతో కలిసి బంధువులంతా కార్లలో హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. బషీర్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ అతివేగంగా అజగ్రత్తగా నడుపుతూ ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టాడు.
Read Also:Kavitha New Party : కవిత.. BRSపై యుద్ధం ప్రకటిస్తారా?
Budhera Flyover Accident: అతివేగమే ప్రమాదానికి కారణం.. ముగ్గురి పరిస్థితి విషమం
కారులో ముందు సీట్లో కూర్చున్న బషీర్ కు బలమైన దెబ్బలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయలు కావడంతో చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఫ్లై ఓవర్ పై ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయము కల్గింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు ప్రమాదానికి గురైన కారు, లారీలను తొలగించి ట్రాఫిక్ అంతరాయన్ని క్లియర్ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

