Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుల్డోజర్‌తో దూసుకెళ్లి ఎనిమిది మందిని బలి తీసుకున్న దుండగుడు

బుల్డోజర్‌తో దూసుకెళ్లి ఎనిమిది మందిని బలి తీసుకున్న దుండగుడు

వార్త 2 months ago

Beijing Bulldozer Attack: చైనా రాజధాని బీజింగ్ శివార్లలోని ఒక రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో అత్యంత భయానక ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి బుల్డోజర్‌తో మార్కెట్‌లోకి దూసుకెళ్లి అక్కడ ఉన్న స్టాళ్లను, ప్రజలను విచక్షణారహితంగా తొక్కిస్తూ బీభత్సం సృష్టించాడు.

ఈ దుర్ఘటనలో ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో మార్కెట్‌లోని వ్యాపారులు, వినియోగదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

Read Also:Iran-America War: త్వరలోనే టెహ్రాన్‌తో ఒక చారిత్రాత్మక ఒప్పందం..ట్రంప్ సంచలన ప్రకటన

నిందితుడు అరెస్ట్.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ ఘాతుకానికి పాల్పడిన 50 ఏళ్ల వ్యక్తిని స్థానిక పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడు అంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. వ్యక్తిగత కక్షలా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

Beijing Bulldozer Attack:సోషల్ మీడియాపై చైనా ఆంక్షలు

సాధారణంగా చైనాలో ఇలాంటి సున్నితమైన అంశాలు జరిగినప్పుడు సమాచారం బయటకు రాకుండా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే బీజింగ్ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాకుండా అధికారులు కట్టుదిట్టమైన నియంత్రణలు విధించినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ ద్వారా ఈ వార్త వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

హార్ముజ్ జలసంధిలో బ్రిటన్ 'అండర్ వాటర్ డ్రోన్లు'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha