Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలోనే టెహ్రాన్‌తో ఒక చారిత్రాత్మక ఒప్పందం..ట్రంప్ సంచలన ప్రకటన

త్వరలోనే టెహ్రాన్‌తో ఒక చారిత్రాత్మక ఒప్పందం..ట్రంప్ సంచలన ప్రకటన

వార్త 2 months ago

శ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం 5వ వారానికి చేరుకుంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల ఫలితంగా అక్కడ 'పాలన మార్పు' (Regime Change) సాధ్యమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) సంచలన ప్రకటన చేశారు.

ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్ పాత నాయకత్వం స్థానంలో ఇప్పుడు అత్యంత హేతుబద్ధంగా వ్యవహరించే కొత్త సమూహం వచ్చిందని, దీనివల్ల త్వరలోనే టెహ్రాన్‌తో ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈ దౌత్యపరమైన ప్రకటనల వెనుక యుద్ధ తీవ్రత భయంకరంగానే కొనసాగుతోంది. గత నెల రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరగడంతో.. టెహ్రాన్, దాని పరిసర ప్రాంతాలు పూర్తిగా చీకటిలో మునిగిపోయాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన పొరుగు దేశాలైన కువైట్, సౌదీ అరేబియాపై క్షిపణి దాడులకు దిగింది. కువైట్‌లోని ఒక విద్యుత్ కేంద్రంపై జరిగిన దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించడం విషాదకరం.

Read Also: KitKat theft: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్ల భారీ దొంగతనం.. ఎక్కడంటే?

 Iran-America War

Iran-America War: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు

అటు సౌదీ అరేబియా తమపైకి వచ్చిన ఐదు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు, దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండగా, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం (UNIFIL) స్థావరంపై జరిగిన దాడిలో ఒక సైనికుడు మరణించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. వాషింగ్టన్ ఒకవైపు శాంతి చర్చలంటూ మాయమాటలు చెబుతూనే, మరోవైపు రహస్యంగా భూతల దాడులకు ప్రణాళికలు రచిస్తోందని ఆయన ఆరోపించారు. అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంలోకి అడుగుపెడితే వారిని దహనం చేయడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ట్రంప్‌ నిర్ణయాల్లో స్థిరత్వం లేదు: ఇరాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha