Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ 15 ఏళ్ల కుర్రాడు ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు.
అనుభవం లేని వయసులో అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ఆడిన వైభవ్, ఆర్సీబీ బౌలర్లను బెంబేలెత్తించాడు.
Read Also: RR vs RCB IPL 2026: రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం..జురెల్ (81), వైభవ్ (78) ఊచకోత
Vaibhav Suryavanshi: “నేను బౌలర్‌ను చూడను.. బంతిని మాత్రమే చూస్తాను”
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని చిత్తు చేసింది. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వైభవ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను బౌలర్‌ను చూసి కాకుండా బంతిని చూసి ఆడతానని ఈ యువ కెరటం ధీమాగా చెప్పాడు.
Vaibhav Suryavanshi 78 runs vs RCB IPL 2026
“ప్రముఖ బౌలర్ (బుమ్రా లేదా హేజిల్‌వుడ్) బౌలింగ్ చేస్తున్నాడని మనసులో ఉన్నప్పటికీ, నేను బంతిని మాత్రమే చూసి ఆడతాను, బౌలర్‌ను కాదు. ప్రాక్టీస్‌లో నేర్చుకున్న నైపుణ్యాలనే మ్యాచ్‌లో అమలు చేయడానికి ప్రయత్నిస్తాను” అని మ్యాచ్ అనంతరం సూర్యవంశీ తెలిపాడు.చిన్న వయసులోనే స్టార్‌డమ్ వచ్చినా తన కాళ్లు నేలపైనే ఉన్నాయని సూర్యవంశీ అన్నాడు.
తన తండ్రి సంజీవ్, రాజస్థాన్ జట్టు సహాయక సిబ్బంది రోమీ భిందర్ ఎల్లప్పుడూ సరైన సలహాలిస్తూ తనను సరైన మార్గంలో నడిపిస్తున్నారని చెప్పాడు. 78 పరుగుల వద్ద ఔటవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అతను.. “నేను చివరి వరకు ఉండుంటే మరో 20 పరుగులు చేసేవాడిని, అది జట్టుకు మరింత ఉపయోగపడేది” అని వ్యాఖ్యానించడం అతని పరిణతికి నిదర్శనం.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

