Batch Mates Review: కాలేజీ లైఫ్, ఫ్రెండ్షిప్, ర్యాగింగ్ వంటి అంశాలతో ఇప్పటికే చాలా వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అదే కోవలో ఇప్పుడు 'బ్యాచ్ మేట్స్' అనే మరో సిరీస్ ప్రేక్షకులను పలకరించింది.
శ్రీహర్ష శెట్టి దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఏప్రిల్ 30వ తేదీ నుంచి ‘జియో హాట్ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం 8 ఎపిసోడ్లు అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ
హైదరాబాద్‌లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సిద్ధార్థ్, మహేశ్, సంహిత, గోల్డీ అనే నలుగురు విద్యార్థులు కొత్తగా చేరుతారు. సిద్ధార్థ్ తల్లి డాక్టర్ కావడంతో అతన్ని కెరీర్ విషయంలో ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోవడంతో సిద్ధార్థ్ కాలేజీలో స్నేహితులతో గడపడానికి ఇష్టపడతాడు. అయితే, కాలేజీలో డీన్ కొడుకు సుహాస్ తన రౌడీయిజంతో అందరినీ భయపెడుతుంటాడు. సిద్ధార్థ్ బ్యాచ్‌తో సుహాస్‌కు గొడవ మొదలవుతుంది. ఈ క్రమంలో, తన బ్యాచ్‌ను వదిలేయాలంటే కాలేజీ స్టాఫ్ రూమ్ నుంచి ఒక రహస్య కవర్ దొంగిలించాలని సుహాస్ కండిషన్ పెడతాడు. ఆ కవర్‌లో ఏముంది? దాని వల్ల సిద్ధార్థ్ బ్యాచ్ ఎలాంటి ఇబ్బందుల్లో పడింది? అనేదే మిగతా కథ.
Read Also: Independence Day Movies: సూర్య సినిమా వాయిదా? రజనీ, సన్నీ డియోల్, నానిల మధ్య బిగ్ క్లాష్
Batch Mates Web Series Review Telugu
విశ్లేషణ
ఈ సిరీస్‌లో స్టూడెంట్స్ ఆలోచనలు, యాజమాన్యం ధోరణిని చూపించే ప్రయత్నం చేశారు. ర్యాగింగ్, సీనియర్ల వేధింపులు, కాలేజీ రాజకీయాలను ప్రధానంగా ప్రస్తావించారు. అయితే, 8 ఎపిసోడ్ల కథను చూస్తే, మనం గతంలో అనేక సినిమాల్లో, సిరీస్‌లలో చూసిన సన్నివేశాలే మళ్ళీ కనిపిస్తాయి. కథనంలో కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. సిరీస్‌లో కామెడీ పండకపోగా, కొన్ని చోట్ల ఇబ్బందికరంగా అనిపిస్తుంది.
నటీనటులు
ప్రధాన పాత్రధారుల నటన కూడా అంతంత మాత్రంగానే ఉంది. పాత్రల డిజైనింగ్ బలహీనంగా ఉండటం వల్ల ప్రేక్షకులు కథలో లీనమవ్వడం కష్టమవుతుంది.
ముగింపు
మొత్తానికి ‘బ్యాచ్ మేట్స్’ సిరీస్ రొటీన్ కాలేజీ డ్రామాగా మిగిలిపోయింది. కాలేజీ నేపథ్యంలో వచ్చే కంటెంట్‌ను ఇష్టపడే వారు ఒకసారి ట్రై చేయవచ్చు కానీ, కొత్తదనం ఆశించే వారికి ఇది నిరాశనే మిగులుస్తుంది. మిగిలిన ఎపిసోడ్లు అయినా ఆసక్తికరంగా ఉంటాయో లేదో వేచి చూ
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

