Rashmi Gautam: తెలుగు బుల్లితెర పాపులర్ యాంకర్ రష్మీ గౌతమ్ మరోసారి తన ముక్కుసూటితనంతో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై స్పందిస్తూ రష్మీ ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
అందులో తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. “అవును, నేను భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తాను” అని ఆమె నిస్సంకోచంగా ప్రకటించారు. పార్టీకి మద్దతు ఇస్తున్నంత మాత్రాన అపరాధాలను సమర్థించనని చెబుతూ.. “నేను మోదీకే సపోర్ట్ చేస్తాను తప్ప, రేపిస్టులకు లేదా లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదు” అని కుండబద్ధలు కొట్టారు. తన రాజకీయ మద్దతును సామాజిక నేరాలతో ముడిపెట్టవద్దని కోరారు.
Read Also : AIADMKలో విభేదాలు తెచ్చిన విజయ్ మద్దతు !

Rashmi Gautam: సెలబ్రిటీల ట్యాగింగ్ సంస్కృతిపై అసహనం
ఏ చిన్న సామాజిక సమస్య తలెత్తినా సెలబ్రిటీలను ట్యాగ్ చేయడం, వారు స్పందించకపోతే దూషించడం ఒక ఫ్యాషన్‌గా మారిందని రష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక పోస్ట్ చేయడం వల్ల క్షేత్రస్థాయిలో మార్పు రాదని, నిజమైన పరిష్కారం కావాలంటే ఆయా అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. తనను దూషించే వారి గురించి తాను పట్టించుకోనని, ఆ ఎనర్జీని సరైన అధికారులను ట్యాగ్ చేసి న్యాయం కోరడానికి ఉపయోగించాలని నెటిజన్లకు హితవు పలికారు.
మూగజీవాల కోసం నా పోరాటం
మానవ సమస్యల గురించి మాట్లాడటానికి సమాజంలో కోట్లాది గొంతులు ఉన్నాయని, అందుకే తాను ‘గొంతులేని’ మూగజీవాల సంరక్షణకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని రష్మీ స్పష్టం చేశారు. మనుషుల సమస్యల పట్ల తాను సానుభూతి మాత్రమే చూపగలను తప్ప, ప్రతి దానిపై పోరాడే శక్తి తనకు లేదని ఆమె నిజాయతీగా ఒప్పుకున్నారు. జంతు ప్రేమికురాలిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంటానని ఆమె పునరుద్ఘాటించారు. సామాజిక అంశాలపై స్పందించినప్పుడు వచ్చే విమర్శలకు భయపడకుండా, తన అభిప్రాయాలను ఇంత నిర్భయంగా చెప్పడం రష్మీ ప్రత్యేకతను చాటుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
SIR వల్లే బెంగాల్ లో బీజేపీకీ భారీ మెజార్టి: శశిథరూర్

