IPL - Sooryavanshi : ఈ ఏడాది ఐపీఎల్ (IPL) సీజన్‌లో సరికొత్త సంచలనం, యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో సృష్టించిన విధ్వంసాన్ని క్రికెట్ అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు.
మైదానంలోకి దిగితే చాలు పరుగుల వరద పారించిన ఈ యువ బ్యాటర్, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి సగర్వంగా ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్నాడు. లీగ్ దశతో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచులను కలుపుకుని మొత్తం 16 ఇన్నింగ్స్‌లలో వైభవ్ ఏకంగా 776 పరుగులు సాధించాడు. టోర్నీ పొడవునా పరుగుల వేటలో నిలకడ ప్రదర్శించిన ఆయన.. వరుసగా 52, 31, 39, 78, 0, 46, 8, 103, 43, 4, 36, 46, 93, 4, 97, 96 రన్స్ స్కోర్ చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇందులో ఒక అద్భుతమైన సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉండటం అతని క్లాస్ బ్యాటింగ్‌కు నిదర్శనం.
Read Also : రాజస్థాన్‌కు టెన్షన్.. వికెట్ కోల్పోకుండా దూసుకెళ్తున్న టైటాన్స్

IPL – Sooryavanshi: గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో వైభవ్ తీవ్ర నిరాశ
వ్యక్తిగతంగా ఎన్నో మైలురాళ్లను అందుకున్నప్పటికీ, ఈ సీజన్ ముగింపులో వైభవ్ సూర్యవంశీని బ్యాడ్ లక్ వెంటాడిందనే చెప్పాలి. ముఖ్యంగా టోర్నీ చివరి నాలుగు మ్యాచుల్లో కేవలం కొన్ని పరుగుల తేడాతో మూడు సెంచరీలు మిస్ చేసుకోవడం అభిమానులను సైతం కలచివేసింది. ఒక మ్యాచ్‌లో 93, ఆ తర్వాతి మ్యాచుల్లో 97, 96 పరుగుల వద్ద అవుట్ కావడంతో శతకాలకు అతి చేరువగా వచ్చి నిరాశగా వెనుతిరగాల్సి వచ్చింది. వీటికి తోడు నిన్న గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన కీలక పోరులో జట్టు ఓటమిపాలు కావడంతో వైభవ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఎంతో డల్గా, నిరాశగా కనిపించిన ‘వైబాయ్’ను చూసి క్రికెట్ లవర్స్ సోషల్ మీడియా వేదికగా “నువ్వు రియల్ ఛాంపియన్‌వి భయ్యా.. బ్యాడ్ లక్ అంతే” అంటూ మద్దతుగా నిలుస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

