Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు ఇవ్వాలి.. కవిత

బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు ఇవ్వాలి.. కవిత

వార్త 2 weeks ago

Kalvakuntla Kavitha: బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని (5-Day Work Week) తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రోజువారీ తీవ్రమైన ఒత్తిడి, పనిభారంతో సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ ఎంతో న్యాయమైనదని ఆమె అభిప్రాయపడ్డారు.

Read Also : Mahalakshmi Free Bus: ఫ్రీ బస్‌తో మహిళల ప్రయాణాలు జోరు.. మూడు నెలల్లో 35.65 కోట్ల ట్రిప్పులు

 Bank employees should be granted a five-day work week: Kavitha.

Kalvakuntla Kavitha: తీవ్రమైన ఒత్తిడిలో బ్యాంకు సిబ్బంది - షిఫ్ట్ విధానం అమలు చేయాలి

బ్యాంకులు తెరిచినప్పటి నుంచి సిబ్బంది నిరంతరం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని కవిత పేర్కొన్నారు. కస్టమర్ల సేవలు, బ్యాక్-ఎండ్ పనులు, బ్యాంకింగ్ టార్గెట్లు, క్యాష్ బ్యాలెన్సింగ్ వంటి బాధ్యతలతో పని గంటలు ముగిసిన తర్వాత కూడా రాత్రి 9, 10 గంటల వరకు పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత దశాబ్దంలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరిగినప్పటికీ ఉద్యోగులపై భారం ఎంతమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. ఒకవేళ శనివారాలు పూర్తిగా సెలవులు ఇవ్వడం సాధ్యం కాకపోతే, బ్యాంకులను వారం రోజులూ తెరిచి ఉద్యోగులకు రోటేషన్ లేదా షిఫ్ట్ విధానాన్ని అమల్లోకి తేరాలని ఆమె వినూత్న ప్రతిపాదన చేశారు.

ప్రభుత్వం నిర్ణయం పైనే ఉత్కంఠ

వారానికి ఐదు రోజుల పని విధానం కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తోంది. ప్రస్తుతం బ్యాంకులకు కేవలం రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే సెలవు దినాలుగా ఉన్నాయి. ఈ డిమాండ్‌పై యూనియన్లు ఇటీవల సమ్మెకు పిలుపునివ్వగా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) స్పందించి చర్చలకు అంగీకరించింది. అంశాన్ని పరిశీలించేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతో యూనియన్లు తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేశాయి.

అయితే, 2024 మార్చిలో జరిగిన వేతన ఒప్పందంలో ఈ 5 రోజుల పని విధానానికి ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలపలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు గతంలోనే స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఆర్‌బీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీ, బీమా సంస్థల్లో ఇప్పటికే ఐదు రోజుల పని విధానం అమలవుతోంది. ఐబీఏ కమిటీ ఇచ్చే సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బ్యాంకు ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, హక్కుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్‌పై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నవంబర్ నుంచి కరెంట్ బిల్లుల మోత?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha