Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Cargo ship attack: భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

Cargo ship attack: భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

వార్త 2 months ago

Cargo ship attack: పశ్చిమాసియాలో రోజురోజుకూ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య సముద్ర మార్గంలో మరో ఘోరం జరిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలో భారతదేశానికి వస్తున్న ఒక భారీ కార్గో నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటన అంతర్జాతీయ నౌకాయాన రంగంలో తీవ్ర కలకలం రేపింది.

రాయల్ థాయ్ నేవీ వెల్లడించిన వివరాల ప్రకారం.. థాయ్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌక యూఏఈలోని ఖలీఫా పోర్టు నుంచి బయలుదేరింది. ఇది గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యలో హర్మూజ్ జలసంధి వద్ద ఈ దాడి జరిగింది.

ఈ దాడి జరిగిన సమయంలో నౌకలో ఉన్న సిబ్బంది ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 20 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడగా, ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ దాడికి గల కారణాలు లేదా దీని వెనుక ఉన్న శక్తుల గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha