Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

వార్త 2 months ago

శ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ భయానక రూపం దాలుస్తోంది. బుధవారం మార్చి 11న, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Dubai Airport) సమీపంలో రెండు అనుమానిత ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి.

ఈ ఘటనలో ఒక భారతీయుడితో సహా మొత్తం నలుగురు వ్యక్తులు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇరాన్ కేవలం అమెరికాపైనే కాకుండా అమెరికా మిత్ర దేశాలపై కూడా విరుచుకుపడుతోంది. దుబాయ్ ఎయిర్ పోర్ట్ ను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుండి దుబాయ్ విమానాశ్రయంపై దాడి జరగడం ఇది మూడవసారి.

Chhattisgarh :108 మంది మావోయిస్టుల సరెండర్.. పాపారావు లొంగుబాటుపై సస్పెన్స్

ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి

దుబాయ్ మీడియా కార్యాలయం సమాచారం ప్రకారం.. డ్రోన్ దాడులు జరిగినప్పటికీ విమాన రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే గతంలో మార్చి 1 , మార్చి 7 తేదీలలో జరిగిన దాడుల సమయంలో ఎమిరేట్స్ వంటి ప్రముఖ విమాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. తాజా దాడుల నేపథ్యంలో యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) క్షిపణి , డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్లు ప్రకటించింది. గాలిలో వినిపిస్తున్న శబ్దాలు మన వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులను అడ్డుకోవడం వల్ల వస్తున్నవేనని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha