Dailyhunt
చాక్లెట్ ఇస్తానని నమ్మించి యాసిడ్ తాగించిన పిన్ని!

చాక్లెట్ ఇస్తానని నమ్మించి యాసిడ్ తాగించిన పిన్ని!

వార్త 6 days ago

Boduppal Crime: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బోడుప్పల్‌లో జరిగిన ఈ అమానుష ఘటన ఉమ్మడి కుటుంబాల్లోని ఈర్ష్యాద్వేషాలు ఎంతటి దారుణాలకు ఒడిగట్టేలా చేస్తాయో కళ్లకు కడుతోంది.తన బిడ్డ కంటే తోడికోడలి బిడ్డను ఇంట్లో అందరూ ఎక్కువగా ప్రేమిస్తున్నారన్న అక్కసుతో, ఒక మహిళ నాలుగేళ్ల చిన్నారికి యాసిడ్ తాగించి ప్రాణాల మీదకు తెచ్చింది.

Read Also: Kakinada: కాకినాడ యాంకరేజ్ పోర్టులోఆకస్మిక తనిఖీలు - భారీగా బియ్యం నిల్వల గుర్తింపు

ఘటనకు దారితీసిన కారణాలు

బోడుప్పల్ శ్రీనివాస కాలనీకి చెందిన పర్వతం సతీష్ కుమార్ కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ కుమార్, అంజమ్మ దంపతులకు నాగరాజు, జగదీష్ అనే ఇద్దరు కుమారులు. వీరికి కూడా వివాహాలు కాగా.. వారందరూ ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు నాగరాజుకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. సతీష్ కుమార్ పెద్ద కుమారుడు నాగరాజు కొడుకుపై ఎక్కువ ప్రేమ చూపించేవాడు. ఇటీవల తన చేతిపై ఆ మనవడి పేరును పచ్చబొట్టు (Tattoo) గా వేయించుకోవడంతో చిన్న కోడలు మంజుల కక్ష పెంచుకుంది. తన కుమారుడిని ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఈర్ష్యతో ఆ పసివాడిని చంపాలని నిర్ణయించుకుంది.

 Acid Attack on Child

పలుమార్లు హత్యాప్రయత్నం

మంజుల అంతకుముందు కూడా ఆ బాలుడిని చంపేందుకు ప్రయత్నించింది.ఒకసారి బాలుడి నోరు, ముక్కు మూసి చంపబోగా తల్లి చూసి అడ్డుకుంది.మరోసారి రెయిలింగ్ గోడపై కూర్చోబెట్టి కిందకు నెట్టేందుకు ప్రయత్నించగా తాత మందలించాడు.

చివరికి యాసిడ్ తాగించి..

ఈ నెల 9న కిచెన్‌లో ఎవరూ లేని సమయం చూసి, బాలుడిని పిలిచిన మంజుల.. ‘జ్యూస్ తాగు.. నీకు చాక్లెట్ ఇస్తాను’ అని నమ్మించింది. బలవంతంగా యాసిడ్ తాగించడంతో బాలుడు గట్టిగా కేకలు వేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Boduppal Crime: పోలీసుల యాక్షన్

ఈ ఘటనపై బుధవారం (ఏప్రిల్ 15) రాత్రి చిన్నారి తల్లి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు మంజులపై హత్యాప్రయత్నం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కసాయిగా మారిన మంజులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

'నీ కొడుకు నీలా లేడు!' ..స్నేహితుల ఎగతాళి.. కోపం వచ్చిన తండ్రి ఏం చేసాడంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha