Dailyhunt
కాకినాడ యాంకరేజ్ పోర్టులోఆకస్మిక తనిఖీలు - భారీగా బియ్యం నిల్వల గుర్తింపు

కాకినాడ యాంకరేజ్ పోర్టులోఆకస్మిక తనిఖీలు - భారీగా బియ్యం నిల్వల గుర్తింపు

వార్త 1 week ago

Kakinada: కాకినాడ యాంకరేజ్ పోర్టులో పౌర సరఫరా మరియు రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా భారీ సోదాలు నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరా కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో పోర్టు పరిసరాల్లోని రైల్వే వ్యాగన్లు, భార్జీలు మరియు వివిధ గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ క్రమంలో మానస ఎంటర్ప్రైజెస్, సత్య బాలాజీ మరియు ఎస్ఆర్ ట్రేడింగ్ వంటి సంస్థల ద్వారా బియ్యం ఎగుమతి అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. చెక్‌పోస్ట్ రిజిస్టర్లను మరియు టెక్నికల్ సిబ్బంది రికార్డులను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా బియ్యం తరలిస్తున్న వైనాన్ని అధికారులు పసిగట్టారు.

Read also: Vegetable Prices Today: ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలు

PDS Rice Seized at Kakinada Port 2026

Kakinada: ఫోర్టిఫైడ్ కెర్నల్స్ గుట్టురట్టు – ఇతర రాష్ట్రాల నుండి అక్రమ రవాణా

సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న బియ్యం నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా, అందులో ప్రభుత్వం పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ కెర్నల్స్ (బలవర్ధకమైన బియ్యం) ఉన్నట్లు నిర్ధారణ అయింది. నిందితులు ఒడిశా, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరిస్తున్నారు. ఈ బియ్యాన్ని కాకినాడలోని సార్టెక్స్ ప్లాంట్లకు తరలించి, అక్కడ నుండి అక్రమ మార్గంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. కేవలం రేషన్ కార్డుదారులకు మాత్రమే అందాల్సిన ఈ బియ్యం బహిరంగ మార్కెట్లో విక్రయించడం చట్టరీత్యా నేరమని అధికారులు స్పష్టం చేశారు.

రూ.3.54 కోట్ల విలువైన ఆస్తుల సీజ్ – కఠిన చర్యలకు ఆదేశం

ఈ తనిఖీల్లో మొత్తం 910 టన్నుల బాయిల్డ్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.54 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే బియ్యాన్ని తరలిస్తున్న 10 లారీలను కూడా సీజ్ చేశారు, వాటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని జిల్లా పౌర సరఫరా అధికారి సత్యనారాయణ రాజు తెలిపారు. మొత్తం రూ.3.54 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసి, నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పేదల నోరు కొట్టి అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని మరియు నిరంతరం నిఘా కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

భార్య కాలు నరికి సంచిలో పట్టుకెళ్లిన భర్త.. తొండపిలో విషాదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha