కిందటేడాది డిసెంబరులో ఇరాన్ (Iran) అదుపులోకి తీసుకున్న ఎనిమిదిమంది భారతీయ నావికులు స్వదేశానికి తిరిగి వచ్చారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా వారు భారత్‌కు తిరిగి రావడం ఆలస్యమైంది.
ఇంధనం అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై ఇరాన్ అధికారులు సీజ్ చేసిన ఓడలో 18మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 16మంది భారతీయులుకాగా మిగిలిన ఇద్దరిలో ఒకరు శ్రీలంక, మరొకరు బంగ్లాదేశ్‌కు చెందినవారు. ఇంధనం అక్రమరవాణా ఆరోపణను షిప్ నిర్వహణా కంపెనీ ఖండించింది. అయితే 16 మందిలో ఫిబ్రవరి 10న ఎనిమిది మంది సిబ్బంది భారత్‌కు తిరిగివచ్చారు. మిగిలిన ఎనిమిదిమంది ఆదివారం (మార్చి 30) భారత్ చేరుకున్నారు. ఈ క్రమంలో వారి తిరుగు ప్రయాణం అత్యంత కష్టంగా సాగింది. వీరు అర్మేనియా నుంచి దుబయి మీదుగా విమానంలో ప్రయాణించారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన వారు అర్మేనియా నుంచి స్వదేశాలకు చేరుకున్నారు.
Read Also: Kerala Assembly Elections 2026: డబ్బు కాదు.. జనమే బలం: ఎన్నికల బరిలో 26 ఏళ్ల యువతి
Iran War
Iran War: జైలులో ఉన్న ఐదుగురు భారతీయులు సహా మిగిలినవారి విడుదల
దుబయికు చెందిన ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్ఎల్‌సీ యాజమాన్యంలోని ఎంటీ వాలియంట్ రోర్ షిప్‌ను అంతర్జాతీయ జలాల్లో ఉండగా డిసెంబరు 8న సీజ్ చేశారు. సిబ్బందిలో కొందరిని ఇరాన్‌లోని బండార్ అబ్బాస్ పోర్ట్ సిటీలో జైలుకు తరలించారు. మిగిలిన వారిని నౌకలోనే నిర్బంధించారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ జనవరిలో వారి కుటుంబాలు భారత్‌లో కోర్టును ఆశ్రయించాయి. భారత విదేశంగా శాఖ వారికి సాయం అందించింది. ఫిబ్రవరి 10న ఎనిమిదిమంది భారత్‌కు తిరిగి వచ్చారు. జైలులో ఉన్న ఐదుగురు భారతీయులు సహా మిగిలినవారి విడుదలకు సంబంధించి ఫిబ్రవరి 27న ఆదేశాలొచ్చాయి. ఆ తర్వాతి రోజు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై మిలటరీ దాడులు ప్రారంభించాయి. ఇరాన్ ప్రతిదాడులు చేసింది. విమానాలు, ఈ ప్రాంతంలో సరిహద్దుల వెంట రాకపోకలకు అంతరాయమేర్పడింది. ”విడుదల ఆదేశాలందాయన్న సంతోషం కనీసం కొన్ని గంటలపాటు కూడా ఉండలేదు” అని షిప్ కెప్టెన్ విజయ్ కుమార్ అప్పటి పరిస్థితులను గుర్తుతెచ్చుకున్నారు.
మిసైళ్ల దాడుల మధ్య భయంభయంగా..
ఇరాన్ అధికారులు వారి పాస్‌పోర్టులు ఇచ్చినప్పటికీ భద్రతాపరిస్థితుల దృష్ట్యా నావికులు బండార్ అబ్బాస్‌లోని ఓడలోనే ఉండిపోవాల్సివచ్చింది. ఆ నౌక ఇరాన్ నావికా దళస్థావరానికి దగ్గరగా ఉంది. లక్ష్యాలకు దగ్గరగా ఉంది. ”రాత్రంతా మా చుట్టూ మిసైళ్లు పడుతుంటే ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోయాం”అని ఆయన చెప్పారు. షిప్ సీజ్ చేసినప్పుడు ఇరాన్ అధికారులు కీలకమైన నావిగేషన్, ఇతర భద్రతాసామాగ్రిని తొలగించారని ఆయన చెప్పారు. దీంతో సురక్షితమైప్రాంతానికి ప్రయాణించలేక పోయామన్నారు. మార్చి 3న భారత రాయబార కార్యాలయం ఓడ నుంచి సిబ్బందిని ఖాళీ చేయించి నగరంలోని హోటల్‌లో వారికి వసతి సౌకర్యం కల్పించింది. తర్వాత వారు అర్మేనియా సరిహద్దుకు 60కిలోమీటర్ల దూరంలోఉన్న జోల్ఫా అనే ఇరాన్ నగరంలో షెల్టర్ తీసుకున్నారు. వీసాలు పొందేందుకు అక్కడ వారు మూడురోజుల పాటు ఎదురుచూశారు. మార్చి 27న ఆర్మేనియా చేరుకున్నవారు రాజధాని యెరెవన్‌లోని హోటల్‌లో ఓ రాత్రి ఉన్నారు. తర్వాత వారు విమానంలో దుబయ్ చేరుకుని అక్కడి నుంచి మార్చి 29 ఉదయానికి వారు ముంబయి చేరుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

