Kerala Assembly Elections 2026: సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) పార్టీ తరఫున కేరళలోని ఎట్టుమానూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఆష్నా తంపి, తన నామినేషన్ అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తి వివరాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.
Read Also:SBI Banking Services Down: నేడు 45 నిమిషాల పాటు యూపీఐ, యోనో సేవలు బంద్!
మొత్తం ఆస్తి: రూ. 84 మాత్రమే.
- నగదు: రూ. 40.
- బ్యాంకు నిల్వ: రూ. 44.
- స్థిరాస్తులు: ఆమె పేరు మీద ఎలాంటి ఇల్లు, స్థలం, కారు లేదా ఇతర వాహనాలు ఏవీ లేవు.
విద్యావంతురాలు.. సామాజిక పోరాట యోధురాలు
ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, ఆష్నా విద్యాపరంగా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నారు. లిటరేచర్‌లో డిగ్రీ, జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసిన ఆమె, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ద్వారా సామాజిక సేవలో అడుగుపెట్టారు.ఆశా వర్కర్ల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో, తన తల వెంట్రుకలను కత్తిరించుకుని నిరసన తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు.
Ashna Thampi
Kerala Assembly Elections 2026: ప్రజా విరాళాలతోనే ఎన్నికల ప్రచారం
భారీ ర్యాలీలు, ఆర్భాటాలకు ఆష్నా తంపి దూరంగా ఉంటున్నారు.ఆమె ప్రచారం పూర్తిగా ప్రజల నుంచి వచ్చే చిన్నపాటి విరాళాల (రూ. 10 నుండి రూ. 50 వరకు) మీదనే సాగుతోంది.స్థానికులు ఇచ్చిన డబ్బుతోనే పోస్టర్లు, పాంప్లెట్లు ముద్రించి, తానే స్వయంగా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు.
ఎన్నికల అజెండా.. ప్రజా సమస్యలే ప్రాధాన్యం
అట్టడుగు స్థాయి సమస్యలే తన గెలుపు లక్ష్యమని ఆష్నా స్పష్టం చేశారు:
- వైద్యం: కోటయం మెడికల్ కాలేజీలో వైద్యుల కొరతను తీర్చడం.
- వ్యవసాయం: వరి రైతులకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడం.
- మౌలిక సదుపాయాలు: స్థానికంగా ఉన్న తాగునీటి ఎద్దడిని నివారించడం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

