Volkswagen : ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) తమ 89 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి అత్యంత కఠినమైన, భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమైంది.
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన (EV) కంపెనీల నుండి ఎదురవుతున్న తీవ్ర పోటీ, పెరుగుతున్న ఉత్పాదక వ్యయాలు, ఐరోపా మార్కెట్లో తగ్గుతున్న డిమాండ్ వల్ల కంపెనీ ఉనికి ప్రమాదంలో పడింది. దీనిని అధిగమించడానికి ఏకంగా లక్ష మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు జర్మనీలోని నాలుగు ప్రధాన ప్లాంట్లను శాశ్వతంగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది.
Read Also: Gaza Genocide: గాజా మారణహోమంపై మోదీ వైఖరిపై సోనియా గాంధీ ఫైర్
Volkswagen
Volkswagen: నాలుగు ప్రధాన ప్లాంట్ల మూసివేత
జర్మనీలోని హానోవర్, జ్వికావు, ఎమ్డెన్ లలో ఉన్న మూడు ప్రధాన ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్లతో పాటు, లగ్జరీ కార్ల బ్రాండ్ ‘ఆడీ’ (Audi) కి చెందిన ప్రతిష్టాత్మక నెకర్సమ్ (Neckarsulm) సైట్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ నాలుగు ప్లాంట్లలోనే ప్రస్తుతం 45,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి అదనంగా, గతంలో కార్మిక సంఘాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం రోడ్‌మ్యాప్‌లో ఉన్న మరో 50,000 ఉద్యోగాల కోతలను కూడా దీనికి జోడించారు. ఫలితంగా, కంపెనీ యొక్క మొత్తం గ్లోబల్ ఉద్యోగులలో దాదాపు 15 శాతం మంది (ప్రతి ఆరుగురిలో ఒకరు) ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఒకప్పుడు చైనా కార్ల మార్కెట్లో తిరుగులేని చక్రవర్తిగా వెలిగిన ఫోక్స్‌వ్యాగన్ స్థానాన్ని చైనా స్వదేశీ ఈవీ దిగ్గజం ‘బీవైడీ’ (BYD) పూర్తిగా దెబ్బతీసింది. చైనా మార్కెట్లో విదేశీ ఆటోమొబైల్ కంపెనీల వాటా 2020లో 57 శాతం ఉండగా, 2025 నాటికి అది 32 శాతానికి పడిపోయింది. చైనాలో బీవైడీ దెబ్బకు ఫోక్స్‌వ్యాగన్ అమ్మకాలు 2024లో రెండో స్థానానికి, 2025లో మూడో స్థానానికి పడిపోయాయి. ఇప్పుడు ఇదే చైనా కంపెనీలైన బీవైడీ, చెరీ, లీప్‌మోటర్లు ఐరోపా మార్కెట్లోకి చొరబడి తమ మార్కెట్ వాటాను రెట్టింపు చేసుకోవడం ఫోక్స్‌వ్యాగన్‌కు కోలుకోలేని దెబ్బతీసింది.
Read hindi news : hindi.vaartha.com

