Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైనా కెమెరాలకు భారత్ చెక్

చైనా కెమెరాలకు భారత్ చెక్

వార్త 2 months ago

India Ban on Chinese CCTV Cameras: భారతదేశ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన సీసీటీవీ కెమెరాలపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 1, 2026 నుండి చైనా తయారీ సీసీటీవీ కెమెరాల వినియోగంపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఉత్తర్వులు జారీ చేసింది. డేటా చోరీ మరియు నిఘా ముప్పు పొంచి ఉందన్న నివేదికల నేపథ్యంలో ఈ కఠిన చర్యలు చేపట్టింది.

Read Also:Marco Rubio : ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- రూబియో

India Ban on Chinese CCTV Cameras: ఎందుకు ఈ నిషేధం? దేశ భద్రతకు ముప్పు ఉందా?

నిఘా పరికరాలు విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు రక్షణ సంస్థల వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో సమాచారాన్ని సేకరిస్తాయి. చైనా కెమెరాల విషయంలో భారత భద్రతా సంస్థలు కొన్ని కీలక ఆందోళనలను వ్యక్తం చేశాయి.ఈ కెమెరాల్లో రహస్యంగా 'బ్యాక్ డోర్' యాక్సెస్ ఉండే అవకాశం ఉందని, దీని ద్వారా సేకరించిన సమాచారం విదేశీ సర్వర్‌లకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 India Bans Chinese CCTV Cameras

రక్షణ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో చైనా కెమెరాలను వాడటం వల్ల మన వ్యూహాత్మక సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంది.ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సర్వైలెన్స్ మార్కెట్‌లలో ఒకటి. తాజా నిర్ణయం వల్ల చైనా కంపెనీలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉండగా.. భారతీయ తయారీదారులకు ఇది పెద్ద అవకాశంగా మారనుంది. తద్వారా 'మేక్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరగనుంది. మొత్తానికి.. డేటా భద్రతే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ , రక్షణ రంగాల్లో పెను మార్పులకు దారితీయనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఐపీఎల్ టికెట్ల వివాదం ముగిసింది- డీకే శివకుమార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha