Glacier Collapse : టిబెట్ సరిహద్దుల్లోని గిరాంగ్ కౌంటీతో పాటు నేపాల్‌లో సంభవించిన భీకర జలప్రళయానికి సంబంధించిన కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
చైనాలోని జిజాంగ్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ఓ పర్యాటకుడు అనుకోకుండా తీసిన వీడియోలో మంచు కొండ (గ్లేసియర్) కూలిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. నేపాల్, చైనా సరిహద్దుల్లోని ఈ విపత్తుకు ఆ గ్లేసియర్ కూలిపోవడమే ప్రధాన కారణమని చైనా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Also: Nepal Floods : 700 కు చేరువలో మృతుల సంఖ్య
Glacier Collapse
Glacier Collapse : ఏడు నిమిషాల్లోనే నేలమట్టమైన గిరాంగ్ పోర్ట్
సముద్ర మట్టానికి సుమారు 5,140 మీటర్ల ఎత్తులో ఉన్న భారీ మంచు కొండ ఒక్కసారిగా విరిగిపడింది. సుమారు 6,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మంచు ఫలకం, రాళ్లు మరియు బురద అత్యంత వేగంగా కొండ లోయల గుండా కిందకు దూసుకొచ్చాయి. కొండపై నుంచి విరిగిపడిన ఈ మంచు మరియు బురద ప్రవాహం దాదాపు 20 కిలోమీటర్లు దిగువకు ప్రవహించి, 3,300 మీటర్ల ఎత్తులో ఉన్న గిరాంగ్ పోర్టును కేవలం ఏడు నిమిషాల్లోనే పూర్తిగా తుడిచిపెట్టేసింది. నేపాల్ వైపు ఉన్న మంచు కొండ కుప్పకూలి, సమీపంలోని సరస్సులో పడడం వల్ల రాళ్లు, బురదతో కూడిన భారీ జలప్రళయం ఉద్భవించిందని చైనా అధికారిక వార్తా సంస్థ ‘జిన్హువా’ తన నివేదికలో స్పష్టం చేసింది. టూరిస్ట్ రికార్డ్ చేసిన వీడియో లొకేషన్, చైనీస్ ఎన్విరాన్మెంట్ అకాడమీ విడుదల చేసిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ చిత్రాలతో పూర్తిగా సరిపోలిందని డైరెక్టర్ కాంగ్ సిచాంగ్ వెల్లడించారు.
వరదల ముప్పును ఎదుర్కోవడానికి రాష్ట్రం సిద్ధం: హిమాచల్ గవర్నర్

