Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైనాలో 'మైసాక్' తుఫాన్ బీభత్సం.. 74.5 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం

చైనాలో 'మైసాక్' తుఫాన్ బీభత్సం.. 74.5 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం

వార్త 2 weeks ago

China Floods: చైనాను భారీ తుఫాన్ వణికిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో 'మైసాక్' (Maysak) తుఫాన్ తీవ్ర కుండపోత వర్షాలతో జలప్రళయాన్ని సృష్టించింది.

ముఖ్యంగా నానింగ్ సిటీలో (Nanning City) తుఫాన్ ప్రభావం అత్యంత భయానకంగా మారింది. ఇక్కడ భారీ వర్షాల ధాటికి ఒక రిజర్వాయర్ ఒక్కసారిగా తెగిపోవడంతో, వరద నీరు ఊళ్లను ముంచెత్తింది. నగర వీధులన్నీ నదులను తలపిస్తుండగా.. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కార్లు, ఇతర వాహనాలు బొమ్మల్లా కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read Also:Rains : వానలు పడకపోతే భారత్ కు పెను భారమే - S&P గ్లోబల్

24 గంటల్లో రికార్డు స్థాయి వర్షపాతం

చైనా వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మైసాక్ తుఫాన్ కారణంగా నానింగ్ నగరంలో గత 24 గంటల్లోనే ఎన్నడూ లేని విధంగా 74.5 సెంటీమీటర్ల (74.5 cm) రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ ఆకస్మిక మేఘమథనం (Cloudburst) వల్ల నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలోని రహదారులు, నివాస సముదాయాలు పీకల్లోతు నీటిలో మునిగిపోయాయి.

China Floods: ఇద్దరు మృతి - రంగంలోకి సహాయక బృందాలు

ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. వరద తీవ్రత నానాటికీ పెరుగుతుండటంతో అప్రమత్తమైన చైనా విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన దాదాపు 50,000 మందికి పైగా ప్రజలను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, రెస్క్యూ టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయని నగర యంత్రాంగం ప్రకటించింది.

Epaper: epaper.vaartha.com

నేడు తెలంగాణాలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha