Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైర్మన్ సుదర్శన్‌రెడ్డికి ఘన సన్మానం

చైర్మన్ సుదర్శన్‌రెడ్డికి ఘన సన్మానం

వార్త 2 months ago

బ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన టేకుల సుదర్శన్‌రెడ్డిని బుధవారం పార్టీ మాజీ మున్సిపల్ అధ్యక్షుడు గుంటి కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గుంటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. సుదర్శన్‌రెడ్డి చైర్మన్ కావడంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. ఆయన సారథ్యంలో మున్సిపాలిటీ అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలన సాగుతుందని, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చైర్మన్‌కు తమ పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుల్తాన్, నాయకులు నీలం బాలు, మంద మహేష్, ముజాకీర్ తదితరులున్నారు.

Read Also:KTR : రేపు జీవన్ రెడ్డి తో కేటీఆర్ భేటీ..బిఆర్ఎస్ లోకి ఆహ్వానం కోసమేనా ?

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తులం బంగారం హామీ అమలుకు తెలంగాణ సర్కార్ కసరత్తులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha