Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు జీవన్ రెడ్డి తో కేటీఆర్ భేటీ..బిఆర్ఎస్ లోకి ఆహ్వానం కోసమేనా ?

రేపు జీవన్ రెడ్డి తో కేటీఆర్ భేటీ..బిఆర్ఎస్ లోకి ఆహ్వానం కోసమేనా ?

వార్త 2 months ago

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు మరియు ఇటీవలి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డిని గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవనున్నారు.

జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి స్వయంగా కేటీఆర్ వెళ్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీలోకి ఆయనను సాదరంగా ఆహ్వానించడంతో పాటు, నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతంపై చర్చించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

Read Also : AP Transport Department: ఏపీలో స్లీపర్ బస్సుల నిషేధం? బస్సు ప్రమాదాల నివారణకు కొత్త రూల్స్!

గులాబీ గూటికి సీనియర్ నేత?: ఏప్రిల్ 13న చేరిక?

చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జీవన్ రెడ్డి.. ఇప్పుడు గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరడంతో ఏర్పడిన గ్యాప్‌ను పూడ్చేందుకు, జీవన్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ అక్కడ తన పట్టును నిలుపుకోవాలని భావిస్తోంది.

కాంగ్రెస్‌కు భారీ షాక్.. జగిత్యాలలో మారుతున్న సమీకరణాలు

జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగానే భావించవచ్చు. జగిత్యాలలో తనకంటూ ఒక ప్రత్యేక అనుచర వర్గాన్ని కలిగి ఉన్న ఆయన, బీఆర్ఎస్‌లోకి వెళ్తే ఆ నియోజకవర్గంలో సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో ఉన్నా, క్షేత్రస్థాయిలో జీవన్ రెడ్డి బలం బీఆర్ఎస్‌కు తోడైతే రాజకీయంగా రసవత్తర పోరు తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ మారుతున్నారనే వార్తలతో జగిత్యాల రాజకీయం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలో ఆకస్మిక తనిఖీ చేసిన డీజీపీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha