Dailyhunt
చల్లారని మంటలు

చల్లారని మంటలు

వార్త 2 weeks ago

Unextinguished fires : పశ్చిమాసియా యుద్ధమేఘాలు ఆకాశాన్నంటుతు న్నాయి. యుద్ధంలో ప్రధానపక్షాలు, వాటి మిత్ర దేశాలు సైతం మంటల్లో మాడి మసైపోతున్నా యి.

యుద్ధం గగనతలం నుంచి భూతలం మీదకు చేరుకోగానే గల్ఫ్ దేశాల్లో భయాందోళనలు వెల్లువెత్తాయి. ఉభయ పక్షాలు ఎవరికి వారే వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని భీష్మంచుకు కూర్చున్నాయి. యుద్ధ పక్షాలు ఒకరి ఆర్థిక మూలాలపై మరొకరు దెబ్బకొట్టే వ్యూహా ల్లోనే ఉన్నారు. యుద్ధ సన్నాహాల్లో అనిశ్చితి అంటూ ఏమీలేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. శ్వేత సౌధాధినేత ట్రంప్ వాగాడంబరం బాగా ఎక్కువైంది. ఆయన ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ఎవరూ నమ్మలేని పరిస్థితి. ఒకానొక సమయంలో ట్రంప్ వెనుకడుగు వేసినా అసలు సిసలు ఈ యుద్ధానికి ప్రోది చేసినా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాత్రం ససేమిరా అన్నారు. మళ్లీ ట్రంప్రంగంలోకి దిగాల్సి వచ్చింది.

Read Also : Iran Representative: ఇండియాపై ప్రశంసలు కురిపించిన ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి


Unextinguished fires

Unextinguished fires : అపార ప్రాణనష్టం, ఆర్థిక నష్టం

ఇరాన్లోని చమురు నిల్వలకు, ఆ దేశ వాణిజ్యానికి గుండెకాయవంటి ‘ఖర్గ్’ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకోగలిగింది. ముందుగా యుద్ధానికి తాత్కాలిక విరమణ అనగానే ట్రంప్ మాటలను ఎవరూ పట్టించు కోలేదు. ప్రత్యర్థి పక్షాలను శాంతింప చేసినట్లు చెబు తూనే ఒక్కసారిగా దాడిచేయటం యుద్ధ ప్రక్రియలో ఒక భాగమే. అమెరికా ఆయుధ సంపత్తి, ఇజ్రాయెల్ ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన అధునాతన ఆయుధాలతో పోల్చిచూస్తే ఇరాన్ఆయుధ సంపత్తి, సైనిక దళాలు, డ్రోన్లు వంటి ఎన్ని ఆయుధాలున్నా తక్కువే. అయినా ఇరాన్ తుదకంటూ పోరాడాలన్న లక్ష్యం పెట్టుకోవడం విశేషం. నెలరోజులు దాటిన ఈ యుద్ధంలో ఇరాన్కు అపార ప్రాణనష్టం, ఆర్థిక నష్టం చేకూరింది. అయినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. అమెరికా, సైనిక, వైమానిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తూ అమెరికా అవాక్స్ విమానాన్ని ధ్వంసం చేయగలగడం ఎవరూ ఊహించని పరిణామం. దాంతో అమెరికా పాలకుల్లో కాస్తంత ఉలికిపాటుకు గురయ్యారు. ఈ ఒక్క విమానం ధ్వంసం కావడం వల్ల అమెరికాకు 6వేల కోట్ల నష్టం వాటిల్లింది. యుద్ధ పర్యవసానంగా ఇరాన్ సైన్యం 2వేల మందికి పైగా పాణాలు కోల్పోయా రు.

చమురు సంక్షోభం

రోజురోజుకీ యుద్ధ పరిణామాలు మారిపోతున్నా యి. వివిధ గల్ఫ్ దేశాలు ఇరాన్ దెబ్బకు బెంబేలెత్తిపోయా యి. అమెరికాతో ఉన్నందుకు పునరాలోచనలో పడ్డాయి. అమెరికా దుందుడుకు చర్యలను ఆదేశ వాసులే వ్యతిరేకి స్తున్నారు. ఎనలిస్టులు సైతం ఇరాన్తో యుద్ధం వల్ల అమెరికా కూడా పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోం దని విశ్లేషిస్తున్నారు. ఖర్గే ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవడానికి జరిగిన ప్రయత్న సమయంలోనే ఇరాన్కు మద్దతుగా యెమెన్ లోని హౌతీలు యుద్ధ రంగంలోకి ప్రవేశించారు. దక్షిణ ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణీతో దాడిచేశారు. ఇజ్రాయెల్లోని సున్నితసైనిక స్థావ రాలే (Military base Raleigh)లక్ష్యంగా హౌతీదాడులు పెరిగిపోతున్నాయి. హౌతీల ప్రవేశం నిర్ణయాత్మక మలుపుగానే యుద్ధ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య ఉద్రిక్తతలు ఆపడానికి తెరవెనుక కొన్ని దేశాలు మధ్యేమార్గంగా కొన్ని చర్యలు చేపట్టారు. నోటికొచ్చినట్లు యుద్ధ అంశాల్ని ప్రస్తా విస్తూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు యుద్ధ వాతావరణంపై ఉపశమనం కలిగించేటట్లు కాక ఉద్రిక్తతలు పెంచే స్థాయి లో ఉన్నాయి. అలా అని ట్రంప్ వాక్ స్వాతంత్ర్యంపై ఎవరూ వ్యాఖ్యానించేందుకు సిద్ధంగా లేరు. నాటో,యూరో పియన్ దేశాలు సైతం ట్రంప్ నిర్ణయాలకు బాస టగా నిలిచే స్థాయిలో యోచించట్లేదు. తన ఆధీనంలో ఉన్న హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడం చేసినతో ప్రపంచవ్యాప్త చమురు రవాణాకు పెద్ద ఆటంకమేర్ప స్తోంది. చమురు సంక్షోభం ఏర్పడి ఇబ్బంది పడ్తున్న అన్ని దేశాలు అమెరికా నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి.అయి నా పెద్దగా మాట్లాడలేకపోతున్నాయి.


Unextinguished fires

యుద్ధం మరో కోణంలోకి

ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడమే అమెరికా లక్ష్యం. ఏప్రిల్ 6వ తేదీలోగా తమ షరతులకు అంగీకరించకుంటేఇరాన్ చమురు మౌలిక వనరులపై దాడులు తప్పవని అమెరికా హెచ్చరిస్తోంది. ఉభయపక్షాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణను ఇరాన్ కోరినందు వల్లనే తాము దయతో అంగీకరించామన్న ధోరణిలో ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలన్నీ ప్రపంచవ్యాప్త జనాన్ని గందరగోళ పరచడానికే. ఇటీవలనే గల్ఫ్ దేశాలు తమ ఇంధన వనరులపై ఇరాన్ దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా పంచన చేరాయి. అంతే గల్ఫ్ దేశాలు తమ భద్రతకు అమెరికా బాస టగా ఉంటాయన్న నమ్మకంతో ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ తొలుత ప్రకటించినట్లు వారి అన్వేషణ, యుద్ధ ప్రేరేపణలకు కారణం ఇరాన్ లోని అణుకేంద్రాల నుంచి సుమారు 450 కిలోల శుద్ధి యురేనియంను స్వాధీన చేసుకోవడం కోసమే. వాటి స్వాధీనం కోసం అమెరికా సైనిక (Military base Raleigh)చర్యకు దిగుతుందని భావిస్తున్నారు. ఈ చర్య యుద్ధ జ్వాలలు మరింత ఎగిసిపడే స్థాయికి చేరు కోవచ్చు. ఇరాన్ తాము అణ్వాయుధాలు తయారీకి ప్రయ త్నించటం లేదని, అలాంటి కార్యక్రమమేదీ తమ వద్దలే దని స్పష్టం చేసినప్పటికీమెరికా, ఇజ్రాయెల్లు నమ్మ డంలేదు. ఏదో అనుమానం ఆవహించి ఇరాన్పై చర్యలు వేగవంతం చేయాలని ప్రయత్నిస్తోంది. యుఎస్, ఇజ్రా యెల్ తెరవెనుక వ్యూహాల్లో ఇరాన్ నుంచి యురేనియం స్వాధీన మొక్కటేచర్చల్లో ఉందనిపిస్తోంది. ఇరాన్ అణ్వా యుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించాలన్న ఏకైక లక్ష్యమే ఈయుద్ధానికి నేపథ్యమని తెలిసిందే. దీనిపై అమెరికా మరింత తీవ్ర నిర్ణయం తీసుకుంటే యుద్ధం మరో కోణంలోకి మారిపోయే అవకాశముంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బాగ్దాద్‌లో తక్షణ దాడుల ముప్పు: అమెరికా రాయబార కార్యాలయం హై అలర్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha