Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో హెలికాప్టర్ కూలినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జోషిమఠ్ సమీపంలోని హతి పహాడ్ వెనుక ఉన్న చాయీ గ్రామ పరిసరాల్లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
అయితే, ఇప్పటివరకు హెలికాప్టర్‌కు సంబంధించిన శకలాలు గుర్తించలేదు. ప్రమాద సమయంలో అందులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారంతా ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, సహాయక బృందాలు ఘటనా ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.
Read Also : Greater Noida: పూలు కోద్దామని వెళ్లి.. అనంత లోకాలకు! కొడుకుని కాపాడబోయి తండ్రి కూడా మృతి
Helicopter crashes in Chamoli…six dead
Uttarakhand Helicopter Crash: ప్రతికూల వాతావరణం.. గాలింపు చర్యలకు అడ్డంకులు
ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ట్రాన్స్ భారత్ కంపెనీకి చెందినదిగా అధికారులు గుర్తించారు. ఫాటా నుంచి బద్రీనాథ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. హెలికాప్టర్‌లో పైలట్ హిమాంశుతో పాటు చంద్రకాంత్, రాజశ్రీ, దినేష్, ఆకాష్, అథర్వ అనే ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అయితే వీరి ప్రస్తుత పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు.
ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉంది. దట్టమైన మేఘాలతో పాటు వర్షం కురుస్తుండటంతో విజిబిలిటీ తగ్గిపోయింది. దీంతో హెలికాప్టర్ కూలిన ఖచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించడం సహాయక బృందాలకు సవాలుగా మారింది. ప్రస్తుతం బద్రీనాథ్, జోషిమఠ్ పరిసరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేసేందుకు మరో రెండు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు.

