Stock market: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరగడం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు ఆగిపోవడంతో పాటు హర్మూజ్ జలసంధిలో సరఫరా ఇబ్బందులు మార్కెట్లను భయపెట్టాయి.
దీనివల్ల ఇన్వెస్టర్లు ఆందోళనకు గురై అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫలితంగా సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయి భారీ పతనాన్ని నమోదు చేసింది.
Read also: Iran-America War: ముందుచూపుతో భారీగా చమురును దాచి పెట్టుకున్న చైనా
Stock market falling chart red arrow
Stock market: ఐటీ రంగం విలవిల.. 24 వేల దిగువకు నిఫ్టీ
ఈ భారీ నష్టాల్లో ఐటీ రంగ షేర్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు 5 శాతం వరకు పడిపోవడంతో మార్కెట్ మరింత బలహీనపడింది. నిఫ్టీ కీలకమైన 24,000 మార్కును కోల్పోయి 23,897 వద్ద స్థిరపడింది. ఐటీతో పాటు ఫార్మా, మీడియా రంగాల్లో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించినా.. మెటల్ రంగం మాత్రం కొంత వరకు నిలకడగా రాణించి ఇన్వెస్టర్లను ఆదుకుంది.
పెరుగుతున్న చమురు ధరలు.. ఇన్వెస్టర్ల ఆందోళన
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‍కు 107 డాలర్లు దాటడం ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారింది. చమురు ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతిక పరంగా చూస్తే నిఫ్టీకి ఇప్పుడు 23,800 స్థాయి చాలా కీలకం. ఒకవేళ ఆ స్థాయిని కూడా కోల్పోతే మార్కెట్ మరింత దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

